100కోట్ల తక్కువ తో ఫ్లై ఓవర్ కట్టొచ్చా?

Update: 2015-11-10 16:34 GMT
పూర్తి స్థాయి పారదర్శకతో వ్యవహరించాలే కానీ..అద్భుతాలు చేయొచ్చన్న విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేతలతోచేసి చూపించారు. ఇవాళ.. రేపటి రోజున ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి ఒక అంచనాతో మొదలైత.. అది పూర్తి అయ్యేసరికి అంచనాకు మించి బారీగా ఖర్చు కావటం తెలిసిందే. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితి ఢిల్లీ రాష్ట్ర సర్కారు చేసింది.

అనుకున్న అంచనా కంటే రూ.100కోట్ల తక్కువ ఖర్చుతో ఫ్లై ఓవర్ ను పూర్తి చేసి సంచలనంగా మారారు ఢిల్లీ ముఖ్యమంత్రి. ఢిల్లీలోని అజాద్ పూర్  నుంచి షాలిమార్ బాగ్ వరకు ఆరు లైన్ల ఫ్లైఓవర్ ను నిర్మించాలని తలపెట్టారు. ఇందుకోసం రూ.247 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందుకు తగ్గట్లే శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయితే.. అంచనా లెక్కింపు.. టెండర్లు.. శంకుస్థాపన అంతా నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ హయాంలో చేపట్టారు. అయితే.. అది పూర్తి కాలేదు.

తాజాగా దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రూ.247 కోట్లు ఖర్చు కావాల్సి ఉన్నా.. ఆరు లైన్ల ఫైఓవర్ పూర్తి అయ్యేసరికి అనుకున్న అంచనా కంటే రూ.104కోట్ల తక్కువకు.. అంటే కేవలం రూ.143 కోట్లతో ఈ ఫ్లైఓవర్ ను పూర్తి చేశారు. తాము సాధించిన ఘనత గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ లో పేర్కాన్నారు. తాజా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరు కావటమేకాదు.. అంచనా కంటే తక్కువ ఖర్చుతో నిర్మాణాన్ని పూర్తి చేయటాన్ని అభినందించారు. చూస్తుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన అన్నీ ప్రాజెక్టుల్ని అరవింద్ కేజ్రీవాల్ కు అప్పగించి.. ఆయన మార్క్ అంచనాలు వేయమని కోరితే ఎలా ఉంటుందో..?
Tags:    

Similar News