మందుబాబులకు వచ్చి పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. సుదీర్ఘకాలం పాటు మందు లేని వేళ.. ప్రభుత్వాల ఆదాయాలు భారీగా పడిపోవటం తెలిసిందే. దీంతో.. నెలన్నర నిషేధానికి చెల్లుచీటి ఇచ్చేస్తూ.. మందు షాపులపై విధించిన ఆంక్షల్ని ఎత్తి వేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మద్యం దుకాణాల్ని ఓపెన్ చేసేందుకు వీలుగా ఉత్తర్వులు వెలువడిన వెంటనే.. ఉరుకులు పరుగులు పెడుతూ మద్యం షాపుల వద్ద భారీ సందడి నెలకొంది.
మందు ముందు భౌతికదూరమా? లైట్ తీసుకునేటోళ్లు ఎందరో. ఇలాంటి వేళ.. ఈ తీరుకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ రాష్ట్ర సర్కారు వినూత్నంగా ఆలోచించింది. మద్యం దుకాణాల వద్ద రద్దీ లేకుండా చేసేందుకు వీలుగా దేశంలో తొలిసారి మందుబాబులకు టోకెన్ సిస్టమ్ అమలు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా పెద్ద ప్రొసీజరే తెర మీదకు తీసుకొచ్చారు.
ఈ టోకెన్ విధానంలోకి వెళితే.. ఢిల్లీ రాష్ట్ర ప్రజలు ఎవరైనా మద్యం కావాలంటే ముందుగా www.qtoken.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి. టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. అనంతరం వారికో టోకెన్ నెంబరు మొబైల్ కు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ టైమ్ కి.. సదరు షాపు వద్దకు వెళ్లి.. టోకెన్ నెంబరు చూపిస్తే మద్యాన్ని ఇస్తారు. భౌతిక దూరం మిస్ కాకుండా ఉండేందుకు వీలుగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు.
సమస్యేమంటే.. ఢిల్లీ ప్రభుత్వం చెప్పినట్లుగా వెబ్ సైట్ ఓపెన్ కావటం లేదు. దీంతో.. వారు తెగ ఇబ్బందికి గురవుతున్నారు. ఎంత మందుకైతే మాత్రం ఇంత పెద్ద ప్రొసీజరా? మందు కావాలనుకున్న తర్వాత దాని కోసం ఇంత వెయిటింగ్ పనికి రాదంటున్నారు. ఇలా కోరుకున్నంతనే.. అలా డెలివరీ అయ్యేలా మద్యం సరఫరా ఉండాలని మందు బాబులు డిమాండ్ చేస్తున్నారు. మరి.. మందుబాబుల మాటకు కేజ్రీవాల్ సర్కారు ఎంత మేర విలువ ఇస్తుందో చూడాలి.