ఢిల్లీలో అక్కడ మాత్రమే టపాసులు కాల్చాలట !

Update: 2020-11-03 07:50 GMT
దేశంలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. ఈ తరుణంలో త్వరలో దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కేవలం గ్రీన్‌ దీపావళి మాత్రమే జరుపుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం‌ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే ఢిల్లీలో తయారు చేసి, అమ్మాలని మంత్రి బుధవారం చెప్పారు. మరోవైపు ఈ ఏడాది టపాసులకి వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నవంబర్‌ 3 నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టుగా గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రజలెవరూ టపాసులు కాల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రతీ ఏడాది దీపావళి టపాసులు పేల్చడం, పంట వ్యర్థాల దహనం కారణంగా ఢిల్లీ కాలుష్యం బారిన పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఈ సారి టపాసులకి దూరంగా ఉండాలన్నారు. ఇక, ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతుండడం వల్ల దీపావళిపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ రోజు టపాసులు కాల్చడానికి 824 ప్రదేశాలను ఎంపిక చేసింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ పర్యావరణానికి హాని చేయని క్రాకర్లను మాత్రమే కాల్చాలని ఆదేశించింది. ప్రభుత్వం గుర్తించిన ప్రదేశాల్లో స్కూళ్లు, కాలేజీలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఎక్కడపడితే అక్కడ, ఏ టపాసులు పడితే అవి కాల్చకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.. టపాసులతో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది.
Tags:    

Similar News