దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణంలో ప్రముఖుల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరునే ఈడీ అధికారులు ఈ స్కాంలో పేర్కొనడం మరింత సంచలనంగా మారింది. ఈ కుంభకోణానికి సంబంధించి మనీలాండ రింగ్ కోణంలో విచారణ చేస్తున్న ఈడీ.. ఇప్పటికే సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది.
దీనికి ముందు తెలంగాణ రాజకీయ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ విచారించింది. ఇక, తాజాగా నమోదైన ఛార్జిషీట్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేర్లను ప్రస్తావించడం సంచలనంగా మారింది. ఇంతకీ సీఎం కేజ్రీవాల్‌పై ఈడీ ఏమందంటే.. లిక్కర్ లైసెన్సులు ఇచ్చేందుకు ఆప్ తరఫున విజయ్‌నాయర్.. చక్రం తిప్పారని..ఈ క్రమంలో దాదాపు 100 కోట్లు తీసుకున్నారని.. ఈ నిధులను ఆప్‌కు సమకూర్చారని తెలిపింది.
ఈ సొమ్మును ఆప్ నేతలు.. గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని తెలిపారు. దీనిలోనూ 70 లక్షల రూపాయలు ఒక్క వలంటీర్లకే ఇచ్చారని ఈడీ ఆరోపించింది. మరో వైపు.. ఇండో స్పిరిట్ కంపెనీలో కవితకు భాగస్వామ్యం ఉందని పేర్కొంది. ఈ కంపెనీలో కవిత తరఫున అరుణ్‌పిళ్లై ప్రతినిధిగా ఉన్నారని, కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును ఇప్పటికే విచారించామని కూడా ఈడీ వివరించింది.
వి.శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. కవిత ఆదేశంతో అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ ఐదుగురిపేర్లు, ఏడు కంపెనీలను చేర్చింది.
విజయ్‌నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్ అరోరాలను నిందితులు గా చేర్చింది. సౌత్‌గ్రూప్ లావాదేవీల్లో శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, విజయ్ నాయర్ కీలక వ్యక్తులుగా ఉన్నారు. మొత్తం ఛార్జిషీట్‌పై 428 పేజీలతో ఈడీ ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది.
తీహార్ జైల్లో ఉన్న సమీర్ మహేంద్రు, శరత్‌రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, బినోయ్ బాబు, అమిత్ అరోరా, ఇటీవల అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరాతో పాటు ముందస్తు బెయిల్‌తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్‌సింగ్, నరేంద్ర సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్ర కంపెనీలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. కాగా, ప్రస్తుతం నిందితులుగా ఉన్న సీఎం అరవింద్, ఎమ్మెల్సీ కవితలకు.. న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.