ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక‌లు.. మోడీ బ‌ల ప్ర‌యోగం.. రెండింటి వెనుక‌!!

Update: 2023-01-17 12:30 GMT
ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఏం చేసినా రాజ‌కీయ కోణం ఖ‌చ్చితంగా ఉంటుంది. ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యు ల‌తో గ‌డిపినా ... దానిని రాజకీయంగా ఎలా వాడుకోవాలో.. ఆయ‌న‌కు బాగా తెలుసు. ఇలానే తాజాగా ఆయ‌న ఢిల్లీలో రోడ్ షో నిర్వ‌హించారు. భారీ ఎత్తున ప్ర‌జ‌లు వ‌చ్చారు. నిజానికి ఇప్పుడు ఢిల్లీలో రోడ్ షో చేయాల్సిన అవ‌స‌రం ఏంటి? అనేది మేధావుల ప్ర‌శ్న‌. అయితే.. దీనికి బీజేపీ ద‌గ్గ‌ర స‌మాధానం ఉన్నా చెప్ప‌రు. ఎందుకంటే.. ఈ రీజ‌న్ అలాంటిది.

ఇలా మోడీ రోడ్ షో చేశారో లేదో.. అప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌క్సేనా.. అనూ హ్యంగా స్పందించారు. ఆ వెంట‌నే ఆయ‌న ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ స‌హా మ‌రో ఏడుగురు ఎక్స్ అఫిషియో స‌భ్యుల‌ను ఎన్నుకునే త‌తంగానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. నిజానికిఈ రెండు విష‌యాల‌కు సంబంధం ఉన్న‌ట్టు ఎవ‌రికీ అనిపించ‌దు. క‌నిపించ‌దు కూడా! కానీ, లోతుగా ఆలోచిస్తే.. మాత్రం ఉంటుంది.

ఢిల్లీలో త‌ను త‌ప్ప‌.. ఎవ‌రూ లేరు! అనే భావ‌న‌ను మోడీ ప్ర‌జ‌ల‌కు పంపించ‌డం ద్వారా.. కార్పొరేష‌న్‌లో కార్పొరేట‌ర్ల‌ను ఆయ‌న ప్ర‌భావితం చేస్తున్నార‌నేది ప‌రిశీల‌కుల భావ‌న‌. ఈ నెల 24న ఢిల్లీ కార్పొరేష‌న్‌లో మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ను ఎన్నుకునే తతంగానికి గ‌వ‌ర్న‌ర్ ప‌చ్చ‌జెండా ఊపారు. మొత్తం 274 వార్డులు ఉన్న ఈ కార్పొరేష‌న్‌లో అధికార ఆమ్ ఆద్మీపార్టీ 150 వార్డుల‌ను గెలుచుకుని అది పెద్ద పార్టీగా అవ‌తరించింది.

ఇక‌, బీజేపీకి 113 స్థానాలు ద‌క్కాయి. కాంగ్రెస్ 9, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఇద్ద‌రు విజ‌యం ద‌క్కించుకు న్నారు. అంటే.. టెక్నిక‌ల్‌గా చూస్తే.. కార్పొరేష‌న్ మేయర్ పీఠం ఆప్‌కే ద‌క్కాలి. ఇక్క‌డే బీజేపీ చ‌క్రం తిప్పుతోంది. మేయ‌ర్ పీఠాన్నితామే ద‌క్కించుకునేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఓటింగ్లో పాల్గొనేందుకు ఏకంగా ఏడుగురు ఎంపీలు(వీరిలో ఆరుగురు బీజేపీవారే), 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

వీరిని కూడా త‌మవైపు తిప్పుకొని కార్పొరేష‌న్ ఓటింగ్‌లో పాల్గొనేలా చేయ‌డం.. త‌ద్వారా ఆప్‌ను మ‌రింత ఇర‌కాటంలోకి నెట్ట‌డం అనే వ్యూహాన్ని మోడీ అమ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఎన్నిక‌లకు ముహూర్తం అయితే ఖ‌రారైంది. ఫ‌లితం ఏంట‌నేది తేలాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News