2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది! మోడీ ప్రభంజనంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది! బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతోంది! ఎన్నికల సమయంలో మోడీ పాలన గురించి విపరీతంగా ప్రచారం చేసిన మీడియా... ఈ మధ్యకాలంలో కాస్త భిన్న స్వరం వినిపిస్తోంది! ఈ ఆరేడు నెలల కాలంలో మోడీ నుండి ఆశించింది ఇది కాదని దాని సారాంశం! అయితే... తాజాగా ఢిల్లీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది! ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆం ఆద్మీ పార్టీ లు ప్రధానంగా బరిలోకి దిగుతొన్నాయి! అయితే ఎన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీచేసినా, బీజేపీ - ఆప్ ల మద్యే బలమైన పోటీ ఉండబోతోందని అటు మీడియా, ఇటు సర్వేలు తెగ ఊదరగొడుతున్నాయి! ఆ సంగతి కాసేపు పక్కన పెడితే... ఈ ఎన్నికల వల్ల ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయం కంటే... బీజేపీ, కాంగ్రెస్ ల భవిష్యత్తు కూడా ఫలితాల్లో తేలబోతోంది!
మోడీపై సామాన్యుడి నమ్మకం మెల్లమెల్లగా తగ్గుతోందని ప్రతిపక్షాలు విమర్శించడం, కాస్త అటు ఇటుగా ఒక మీడియాలో ఇటువంటి వార్తలే రావడం తో ఈ ఎన్నికలు ఈ ఏడు నెలల మోడీ పాలనకు లిట్మస్‌టెస్టు వంటివి అని విశ్లేషకుల అభిప్రాయం! ఈ ఎన్నికల్లో విద్యావంతులు ఎక్కువగా ఉన్న, దేశ రాజధాని లో జరిగే ఎన్నికలు కావడంతో ఇది కచ్చితంగా మోడీ పాలనపై మద్యతరగతి కుటుంబాల ఆలోచన ఎలా ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతాయని అంటున్నారు! ఇదే క్రమంలో... కాంగ్రెస్ పార్టీ బలపడటానికి కొద్దో గొప్పో ఏమైనా అవకాశాలున్నా కూడా ఈ ఎన్నికల్లోనే తేలిపోనుంది! ఈ ఎన్నికల్లో కనీసంలో కనీసం ఏడు లేక ఎనిమిది సీట్లయినా కాంగ్రెస్ సంపాదించగలిగితే... ఆ నేతలు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చనేది పలువురి అభిప్రయం! ఈ విషయాలు పరిశీలిస్త్తోంటే... కచ్చితంగా ఢిల్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ ల భవిష్యత్తుపై ఒక క్లారిటీ ఇవ్వబోతోన్నాయి అనడంలో సందేహం లేదు!