భయపెడుతోన్న డెల్టా ప్లస్ వేరియంట్‌.. దేశంలో రెండో మరణం..

Update: 2021-06-25 07:30 GMT
ఇండియా లో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ జోరు కొనసాగుతుంది. అయితే ,గతం తో పోల్చితే కొంచెం తక్కువగా మహమ్మారి కేసులు నమోదు అవుతున్నాయి. ఇక సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది కదా కొంచెం రిలాక్స్ అవ్వొచ్చు అనుకుంటే , దేశంలో  డెల్టా ప్లస్ వేరియంట్‌ టెన్షన్ రోజురోజుకి పెరిగిపోతుంది. దేశంలో రోజురోజుకీ డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ లో డెల్టా ప్లస్ కేసులు ఎక్కువగా నమోదు అయింది.

 ఇక, దేశంలో నిన్ననే  డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్‌ లో ఒక మహిళ డెల్టా ప్లస్‌ మ్యుటెంట్‌ తో మరణించింది. తాజాగా అదే రాష్ట్రంలో మరో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తో మరణం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌ లో ఇప్పటివరకు ఏడు డెల్టా ప్లస్ కేసులు బయటపడ్డాయి. వీరిలో ముగ్గురు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, వ్యాక్సిన్ తీసుకున్న వారు ఈ మహమ్మారి నుండి కోలుకొని ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నారు.  ఇక, దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 21 కేసులు బయటపడగా మధ్యప్రదేశ్, కేరళ, జమ్మూకశ్మీర్‌ లో మిగిలినవి బయటపడ్డాయి.

కాగా, దేశంలోని ఈ వేరియంట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ రాష్ట్రాలతో పాటు మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుతో పాటు కశ్మీర్‌ లో కూడా ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రాలో ఈ వైరస్ భారిన 21 మంది పడ్డారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే లాక్‌ డౌన్ నిబంధనలు సడలిస్తున్న సమయంలో ఇది బయటపడడం స్థానిక ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మాస్క్‌ తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పారు. మరోవైపు ఈ వేరియంట్ ప్రస్తుత వ్యాక్సిన్స్‌ తట్టుకుంటుందా లేదా అనే దానిపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం వేరియంట్స్ రూపాంతరం చెందుతూ కొత్తగా పుట్టుకువస్తుంటాయిని, ఇది నిత్య ప్రక్రియగా మారుతుందని, ఇలా నయా వేరియంట్లు వస్తూ పోతుంటాయని, కాని సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వైరాలజి నిపుణులు చెప్పారు.
Tags:    

Similar News