కాళేశ్వరం డీటైల్డ్ రిపోర్ట్ చెప్పేదేమిటి?

Update: 2016-09-14 04:16 GMT
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఒకటి. ఈ పథకంపై తెలంగాణ అధికారపక్షం బోలెడన్ని ఆశలు కలిగేలా మాటలు చెబుతుంటే.. తెలంగాణ విపక్షం అందుకు పూర్తిభిన్నమైన వాదనను వినిపిస్తోంది. వైఎస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుఅంటూ 2008లో షురూ చేసిన ప్రాజెక్టును రీ డిజైన్ చేసి.. ప్రాణహితను అదిలాబాద్ జిల్లాకు పరిమితం చేసి.. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించి వినియోగించుకునేలా ‘కాళేశ్వరం ఎత్తిపోతల’పథకాన్ని డిజైన్ చేసింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎంతో మేలు కలుగుతుందని తెలంగాణ అధికారపక్షం వాదిస్తుంటే.. విపక్షాలు మాత్రం ఈప్రాజెక్టు అధికారపక్షానికి కమిషన్లు కుమ్మరించటం తప్పించి మరెలాంటి లాభం కలుగదని మండిపడుతోంది. ఇదిలా ఉండగా.. రీడిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను కన్సల్టెన్సీ సంస్థ వాప్కోన్ ఇరిగేషన్ శాఖకు అందజేసింది.

ప్రభుత్వానికి కాస్తంత అనుకూలంగా ఉండేలా తయారయ్యే అవకాశం ఉందనిచెప్పే ఈ నివేదికలో ప్రాజెక్టు గురించి ఏమేం విషయాలు ప్రస్తావించారు? వాటివివరాలు ఏంటి? లాంటి అంశాల్ని చూస్తే..

= కేంద్ర జలసంఘం నివేదిక ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద 90 రోజుల్లో 100టీఎంసీలు.. 150 రోజుల్లో 130 టీఎంసీలు మళ్లించటానికి వీలుంది. ఎగువరాష్ట్రం తన కేటాయింపుల్ని పూర్తిగావాడుకుంటే ఇది కాస్తా 67 టీఎంసీలకు పడిపోతుంది. మేడిగడ్డ వద్ద 282 టీఎంసీల నీటి లభ్యత ఉందని.. ఇదెంతో అనువైన ప్రాంతమని నివేదిక పేర్కొంది. అదే సమయంలో తుమ్మిడిహట్టి వద్ద152 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంతో బ్యారేజీ నిర్మిస్తే ముంపునకు గురయ్యే ప్రాంతం మహారాష్ట్రలో 85శాతం ఉంటుందని.. అదే సమయంలో ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద అయితే ముంపు ప్రాంతం తెలంగాణలో 77 శాతం.. మహారాష్ట్రలో23 శాతం ఉంటుంది.

= ఈ పథకానికి అయ్యే ఖర్చు రూ.80,500 కోట్లు. ఇందులో భూసేకరణకే రూ.8600 కోట్ ఖర్చు అవుతుంది. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం ఈపథకం కింద రూపాయి ఖర్చు పెడితేరూ.1.55 ప్రయోజనం కలుగుతుంది. ఈపథకం కింద ఏడాదికి విద్యుత్ వినియోగానికి రూ.4067.4 కోట్లు ఖర్చుఅవుతుంది. మొత్తంగా చూస్తే ఏడాదికి అయ్యే ఖర్చు రూ.13923 కోట్లు అయితేప్రయోజనం రూ.21,648.9 కోట్లుగా లెక్క తేల్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటిని మళ్లించి ఆయుకట్టుకు నీటిని సరఫరా చేస్తారు.

= అదిలాబాద్.. కరీంనగర్.. మెదక్.. నల్గొండ.. నిజామాబాద్..రంగారెడ్డి జిల్లాల్లో18.5 లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందిస్తారు. రబీలో మరో5.5లక్షల ఎకరాలకు ప్రాతిపాదించారు. గ్రేటర్ హైదరాబాద్ తాగునీరు.. పారిశ్రామిక అవసరాలు.. మార్గమధ్యంలో గ్రామాలకు తాగునీరు ఈ పథకంతో కుదురుతుంది. ఈ పథకంలో భాగంగా మొత్తం 180.5 కిలోమీటర్ల దూరం నీటినిసరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో 1539 కిలోమీటర్లు కాలువ ద్వారా.. 198 కిలోమీటర్లు సొరంగ మార్గం ద్వారా.. 68 కిలోమీటర్లు ఫ్రెషర్ మెయిన్స్ ఉన్నాయి. 19పంప్ హౌస్ లు నిర్మించాల్సి ఉంటుంది. 100 మీటర్ల కంటే ఎక్కువఎత్తున్న లిఫ్టులు ఉన్నవి ఐదు. వీటిలో నీళ్లను తోడటానికి 4627 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది.

= కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద మొత్తం నీటి వినియోగం 225 టీఎంసీలు.మేడిగడ్డ బ్యారేజీ ద్వారా మళ్లించే గోదావరి నీరు 180 టీఎంసీలు. నీటిని నిల్వచేయటానికి కొత్తగా నిర్మించే బ్యారేజీలు.. ఆన్ లైన్ రిజర్వాయర్ల సామర్థ్యం151.27 టీఎంసీలు. ఈ పథకం ద్వారా కొత్తగా సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్న అయుకట్టు 18.25లక్షల ఎకరాలు. ఈ ప్రాజెక్టులో అత్యధిక ఆయకట్ట మెదక్ జిల్లాలో 7.30 లక్షల ఎకరాలు కాగా.. అత్యల్పంగా వరంగల్ జిల్లాల్లో20,595 ఎకరాలు మాత్రమే.
Tags:    

Similar News