దేవేందర్ గౌడ్ ప్లాన్ వర్కవుట్ అవుద్దా?

Update: 2018-10-16 08:29 GMT
తెలంగాణ సీనియర్ నేతల్లో ఒకరు దేవెందర్ గౌడ్. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన టీ టీడీపీ మేపిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో బరిలో నిలవనున్నుట్లు చెబుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన దేవేందర్ గౌడ్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత చంద్రబాబుతో విభేదించిన నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. తెలంగాణ మొత్తం యాత్రలు నిర్వహించారు. బీసీల్లో ఆయనకు గట్టి పట్టుంది. అయితే, కాలం కలిసిరాకపోవడంతో మరలా టీడీపీలో చేరిపోయారు.

ఆరోగ్యం బాగా లేక రాజకీయాల్లో దూరంగా ఉన్న ఆయన తెలంగాణ ఎన్నికల వేళ యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు.  ఏపీలో ప్రవేశపెట్టిన అన్న క్యాంటిన్ల మాదిరిగా తెలంగాణాలో జయశంకర్ క్యాంటిన్ల ఏర్పాటుకు పథక రచన చేసింది ఈయనే. కూటమి అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయునున్నుట్ల తెలిపారు.

కాగా, గతంలో దేవేందర్ గౌడ్.. మేడ్చల్, ఉప్పల్ నుుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయన కొడుకు వీరేందర్ గౌడ్ ను ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఉప్పల్ సీటును వీరేందర్  కోసం వదిలేయాలని అధిష్ఠానం వద్ద ప్రతిపాదన పెట్టారు. ఆయన ఇప్పటికే ప్రచారం కూడా మొదలెట్టేశారు. ఇక, దేవేందర్ గౌడ్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అంశం ఆసక్తిగా మారింది.

పునర్విభజన తరువాత గతంలో ఆయన పోటీ చేసిన ప్రాంతాలు మూడు నియోజకవర్గాల్లో చీలిపోయాయి. పార్టీ ఓటు బ్యాంకుతో పాటు, సామాజిక వర్గాల పరంగా బేరీజు వేసుకుని ఎక్కడ నుంచి పోటీ చేయాలో సమాలోచనలు చేస్తున్నారు. రాజేందర్ నగర్ సీటు అయితే అన్నిరకాలుగా బాగుంటుందని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈయన కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశారట.

దేవేందర్ గౌడ్ బరిలో నిలవడం వల్ల గెలుపు ఖాయమని కూటమి నేతలు భావిస్తున్నారు. బీసీ సామాజిక వర్గం పరంగా కలిసి వస్తుందని అనుకుంటున్నారు. ఆయన గెలుపు తథ్యమని భావిస్తున్నారు.
Tags:    

Similar News