కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశాలకు కొదవలేదు. ఈ ప్రాజెక్టు కోసం ముఖ్యతిధులుగా వచ్చిన మహారాష్ట్ర.. ఏపీ ముఖ్యమంత్రులకు కేసీఆర్ అండ్ కో ఘన స్వాగతం పలికారు. పూజ అనంతరం.. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ తన పక్కనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను ఉంచుకోవటం గమనార్హం. హోమం చేసిన ప్రాంతం నుంచి.. ప్రాజెక్టు వరకుకానీ.. ఆ తర్వాత కానీ ఫడ్నవీస్ పక్కనే కేసీఆర్ ఉండటం కనిపించింది.
అంతేకాదు.. ప్రోటోకాల్ ప్రకారం చూస్తే.. తెలంగాణ.. ఆంధ్ర.. మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో పోలిస్తే గవర్నర్ నరసింహన్ ముందుంటారు. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు.. కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభ సమయంలోనూ చాలా కార్యక్రమాల్ని కేసీఆర్.. జగన్.. ఫడ్నవీస్ చేత చేయించారు. తొలి ప్రాధాన్యత ముఖ్యమంత్రులకే దక్కటం కనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర జరిగిన కార్యక్రమంలో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఫడ్నవీస్ కు దక్కిందని చెప్పాలి.
కేంద్రంతో తన సంబంధాలు సరిగా లేని నేపథ్యంలో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలుగని రీతిలో వ్యవహరించాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ జాగ్రత్త వహించారని చెప్పాలి. ఒక దశలో జగన్ ఓపక్కగా ఉండిపోగా.. ఫడ్నవీస్ పక్కనే కేసీఆర్ ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత కన్నెపల్లి వద్ద పంప్ హౌస్ ప్రారంభం సందర్భంగా ఫడ్నవీస్ లేకపోవటంతో.. జగన్ పక్కనే కేసీఆర్ ఉన్నారు. పంప్ హౌస్ కు సంబంధించిన వివరాల్ని జగన్ ఆసక్తిగా అడిగి తెలుసుకోవటం కనిపించింది. భారీ పంప్ హౌస్ లో మోటార్లు మొదలుకొని.. పలు అంశాల్ని జగన్ కు కేసీఆర్ వివరంగా చెప్పారు. అంతేకాదు.. కొందరు ఇంజనీరింగ్ ముఖ్యులను జగన్ కు పరిచయం చేశారు. వారిని అడిగి మరికొన్ని సాంకేతిక అంశాల్ని తెలుసుకున్న జగన్. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనుకున్నట్లే ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారీగా జరిగిందని చెప్పాలి.