ఏపీ టీడీపీ అధికార పార్టీలోకి పెరుగుతున్న జంపింగ్ లు ఆ పార్టీ నేతల్లో అసంతృప్తికి దారితీస్తోంది. ఒకరకంగా ఇది పార్టీలో ముసలం పుట్టిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలో ఎన్నో ఆశలతో ఉన్న నేతలు కొత్త వారి చేరికకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తుండడంతో తమ ప్రాధాన్యం తగ్గిపోతుందని భయపడుతున్నారు. అదేసమయంలో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. తాజాగా విజయవాడకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ ఉరఫ్ నెహ్రూ తన తనయుడు అవినాష్ సహా మందీ మార్బలంతో టీడీపీ సైకిల్ ఎక్కేశారు. వీరికి చంద్రబాబు రెడ్ కార్పెట్ స్వాగతం పలికి.. పార్టీ కండువా కప్పారు.
ఈ సమయంలో దేవినేని నెహ్రూ.. చంద్రబాబుపై ఎక్కడాలేని పొగడ్తల వర్షం కురిపించారు. చచ్చిపోయినప్పుడు టీడీపీ కండువాను కప్పుకొనే పోవాలనుకున్నానని చెప్పారు. అమరావతి సృష్టికర్త చంద్రబాబేనని ఆయన ఆకాశానికి ఎత్తేశారు. వైకాపా అధినేత జగన్ వేస్ట్ అని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా దేవినేనిని మెచ్చుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. దేవినేని సైకిల్ ఎక్కడంపై టీడీపీ సీనియర్ నేతలు - ప్రస్తుత ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్ - వల్లభనేని వంశీలకు అంతగా ఇష్టం లేదు. గతంలో చంద్రబాబుపై నెహ్రూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసినప్పుడు వల్లభనేని కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. అలాంటి నేతను ఇప్పుడు చంద్రబాబు పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ఆయన తన అనుచరుల వద్ద తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే వల్లభనేని.. దేవినేని ఏర్పాటు చేసిన బహిరంగ సభకు డుమ్మాకొట్టారు. అదేవిధంగా బోడే ప్రసాద్‌కు కూడా దేవినేని అంటే అస్సలు పడదు. ఈ కారణంగా ఈ ఇద్దరు నేతలూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది. వాస్తవానికి వంశీకి కానీ - బోడే ప్రసాద్ కు కానీ నేరుగా విజయవాడ రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదు. ఇద్దరూ కూడా కృష్ణా జిల్లాకు చెందిన నేతలే అయినప్పటికీ.. వంశీ గన్నవరం నుంచి, బోడే ప్రసాద్ పెనమలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, గతంలో దేవినేనిపై ఇద్దరూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. అలాగే నెహ్రూ గతంలో సుదీర్ఘంగా ప్రాథినిత్యం వహించిన కొన్ని కీలక ప్రాంతాలు ఇప్పుడు వీరి నియోజకవర్గాల్లో ఉన్నాయి.
నెహ్రూ టీడీపీలోకి వస్తే తన అనుచరులతో తమ నియోజకవర్గాల్లో ఎక్కడ వేలు పెడతాడో అని వీరు సందేహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు దేవినేని టీడీపీ సైకిల్ ఎక్కడంతో వారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ కారణంతోనే వీరిద్దరు నెహ్రూ టీడీపీ జాయినింగ్ మీటింగ్ కు డుమ్మాకొట్టారని సమాచారం. అయితే, ఈ విషయంలో చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయినట్టు తెలిసింది. ఇద్దరితోనూ ఆయన చర్చించారని సమాచారం. పార్టీ అవసరాల రీత్యా కొందరిని చేర్చుకోవాల్సి వస్తోందని ఆయన వారికి నచ్చజెప్పారని తెలిసింది. మరి వీరిద్దరూ అలక వీడుతారో.. లేదో చూడాలి.