బాబుకు ఇంగ్లీష్ రాదని ఒప్పుకున్న మంత్రి

Update: 2017-01-30 08:06 GMT
వైసీపీ అధినేత జగన్ ను విమర్శించడంలో అందరికంటే ముందు నిలవాలని నిత్యం తాపత్రయపడే ఏపీ మంత్రి దేవినేని ఉమా మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ ను దురహంకారి అన్నారు... అందంగా ఉంటానని, ఇంగ్లీష్ బాగా వచ్చన్న అహంకారం జగన్ కు ఎక్కువగా ఉందంటూ విరుచుకుపడ్డారు. అయితే, దేవినేని చేసిన విమర్శలపై వైసీపీ వర్గాలు మాత్రం డిఫరెంటుగా స్పందిస్తున్నాయి. జగన్ పై ఆయన చేసిన విమర్శలతో చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదని ఒప్పుకున్నట్లయిందని... చంద్రబాబు ఇంగ్లీష్ లో మాట్లాడలేరని తమ నేత ఎప్పటి నుంచో చెబుతున్నారని.. ఇప్పుడు చంద్రబాబు వద్ద మంత్రిగా పనిచేస్తున్న దేవినేని కూడా ఆ విషయం అంగీకరించినట్లయిందంటున్నారు.
    
కాగా దేవినేని ఈ రోజు విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ... అవినీతి డ‌బ్బుతో మీటింగులు పెట్టుకొని చంద్రబాబు నాయుడిని, ఏపీ ప్ర‌భుత్వాన్ని జగన్ తిడుతున్నారని ఆరోపించారు. రైతుల‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నా   రైతులను పట్టించుకోవడం లేదని జగన్ విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు. తాము చేస్తోన్న ప్ర‌తి కార్య‌క్ర‌మంపై అస‌త్య ప్ర‌చారాలు చేయ‌డ‌మే జ‌గ‌న్ ప‌నిగా పెట్టుకున్నారని, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తోన్న జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌జ‌లు తిప్పికొట్టాలని సూచించారు.
    
జ‌గ‌న్ అస‌త్య‌ప్ర‌చారం చేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వ‌లేక త‌ట్టుకోలేక ప్రాజెక్టుల‌ని అడ్డుకుంటున్నారని ఆయ‌న ఆరోపించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకి జ‌గ‌న్‌ అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని, రైతుల‌తో కోర్టుల్లో కేసులు వేయిస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాను ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ఇస్తే అందుకు త‌గ్గ‌ట్లు జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News