ఈ మాట ఎవరి నోటి నుంచి వచ్చిందో తెలిస్తే కాస్త ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మాటలు ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ నోటి నుంచే వచ్చాయి. మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానున్నకృష్ణా పుష్కరాల సందర్భంగా మంత్రి దేవినేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పుష్కరాల పనుల ఏ విధంగా జరుగుతున్నాయి? ఏర్పాట్ల మాటేమిటి? లాంటి అంశాలపై వివరాలు తెలుసుకున్న మంత్రి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం గమనార్హం.
తెలంగాణ నుంచి వచ్చే యాత్రికుల పట్ల స్పెషల్ కేర్ తీసుకోవాలని.. వారి విషయంలో ఎవరూ అజాగ్రత్తగా వ్యవహరించొద్దని.. అప్రమత్తంగా ఉండటంతో పాటు.. వారు ఆనందంగా తిరిగి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్న విషయాన్ని దేవినేని ఉమ చెప్పుకొచ్చారు. కృష్ణా చుట్టుపక్కల తెలంగాణ జిల్లాల వారు పుష్కరాల సందర్భంగా ఏపీలోని పలు కృష్ణా ఘాట్లకు వచ్చే అవకాశం ఉన్నందున.. అతిధ్యం విషయంలో వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని.. వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శించాలని ఒకటికి రెండు సార్లు చెప్పటం గమనార్హం.