నిన్న జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లో టీఆర్ఎస్ పార్టీ తన హవాను కొనసాగించింది. మరోసారి సత్తా చాటి కాంగ్రెస్,బీజేపీ, టీడీపీ నాయకులకు కనీసం కలబడే అవకాశం లేకుండా తన పట్టును నిలుపుకుంది.
హైదరాబాద్ శివారులోని నిజాంపేట మున్సిపాలిటీని కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 26వ డివిజన్ లో నిలబడిన ధనరాజ్ యాదవ్ తన హవాను మరోసారి కొనసాగించారు. యువకుడైన ధన్ రాజ్ ప్రస్తుత మంత్రి.. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండే శంబీర్ పూర్ రాజుకు దగ్గరి నేత. వారి పూర్తి సహకారం లభించడంతో ధనరాజ్ యాదవ్ తోపాటు ఆయన తన భార్య ను 7వ డివిజన్ లో నిలబెట్టుకొని గెలిపించుకున్నాడు. రెండు డివిజన్లలోనూ గులాబీ పార్టీని గెలిపించి తనపై టీఆర్ఎస్ అధిష్టానం, ఎమ్మెల్సీ శంభీర్ పూర్ రాజు పెట్టుకున్న నమ్మకాలను నిలబెట్టుకోవడం విశేషం.
ఇక ధనరాజ్ యాదవ్ తాను, తన భార్యను గెలిపించుకోవడమే కాదు.. ఏకంగా పార్టీకి కష్టంగా మారిన డివిజన్ల లోనూ పాటు పడ్డారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ మిగిలిన అన్ని డివిజన్ లలో అభ్యర్థుల గెలుపు కోసం కూడా కృషి చేశారు. రాబోయే రోజులలో మున్సిపాలిటీలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఈ గెలుపుతో మంచి బాట వేసుకున్నాడని చెప్పుకోవచ్చు.
ఒక వైపున మంత్రి కేటీఆర్ దగ్గర మంచి పట్టు ఉన్న ఎమ్మెల్సీ శంభీర్ పూర్ రాజు అడుగు జాడలలో నడుస్తూ ఎమ్మెల్యే వివేక్ కలలుకన్న నిజాంపేట అభివృద్ధి కి తన వంతు బాటలు వేస్తానని ధన్ రాజ్ యాదవ్ చెప్పుకొస్తున్నాడు.
ధన్ రాజ్ యాదవ్ ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అందరినీ కలుపుకొని పోయారు. కులం, మతం అన్న బేధం చూపించకుండా ప్రజలందరికీ తోడుగా నిలబడ్డారు. తనను నమ్ముకుని వచ్చిన వారికి అండగా ఉన్నానన్న భావన కలిగించడంతో సక్సెస్ అయ్యారు. అందుకే ధన్ రాజ్ యాదవ్ గెలుపు కోసం యువకులు కూడా పట్టు వదలకుండా కృషి చేశారు.
ఎమ్మెల్యే వివేక్ కూడా ధనరాజ్ పార్టీ కోసం చేస్తున్న కృషిని గుర్తించారు. గత సార్వత్రిక ఎన్నికలలో ధనరాజ్ పడిన కష్టాన్ని గుర్తించి అతడికి టికెట్లు ఇచ్చి అగ్ర తాంబూలం కట్టబెట్టారు. పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ సొంత తమ్ముడి గా భావిస్తూ ముందుండి నడిపించారు.. నేతల అండ దండలతో గెలిచిన ధనరాజ్ యాదవ్ మరో మెట్టు ఎక్కి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.