ఆయన వైసీపీకి చెందిన సీనియర్ మంత్రి. ఆయన అనుభవం అపారం. ఆయనకు ఉన్న అవగాహన కూడా చాలా ఎక్కువ. ప్రజల మూడ్ తెలుసుకోవడంలో ఆయన ఎపుడూ ముందుంటారు. అలాంటి ఆ మంత్రి గారు ఒక విషయంలో మాత్రం జనాలను సరిగ్గా అర్ధం చేసుకోలేదా లేక ఆయన చెప్పిన సందేశం జనాలకు సరిగ్గా వెళ్లలేదా ఎక్కడ సమస్య ఉంది. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఇదే ఇపుడు జరుగుతున్న చర్చ. ఇంతకీ ఆ మంత్రిగారు ఎవరు అంటే ధర్మాన ప్రసాదరావు. ఆయన ఉత్తరాంధ్రా సమస్యల మీద ఇపుడు మాట్లాడుతున్నారు.
విశాఖ రాజధాని కావాలని గట్టిగా తన వాదన వినిపిస్తున్నారు. ఒక విధంగా ఆయన తాను అనుకున్న విషయాన్ని జనాల మద్దతు బాగానే కూడగడతాను అని కూడా నిబ్బరంగా ఉండి ఉండాలి. కానీ ఆయన అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరులా పరిస్థితి అయితే ఉంది. మంత్రి గారు ఎంతలా గొంతు చించుకుంటున్నా కూడా జనాల నుంచి ఉత్తరాంధ్రాకు అనుకూలంగా ప్రత్యేకించి విశాఖ రాజధానికి మద్దతుగా పెద్దగా గొంతులు వినిపించడంలేదు.
ఇదే ఆయనలో కాస్తా అసహనం పెంచుతోంది అనుకోవాలి. నిజానికి మూడు రాజధానుల విషయంలో వైసీపీ హై కమాండ్ మంత్రులను పురమాయించి గట్టిగా ఆయా ప్రాంతాలలో వారి బలమైన వాదన వినిపించమని కోరిందని ప్రచారం జరిగింది. అయితే హై కమాండ్ చెప్పిన దానికంటే కాస్తా ఎక్కువగానే మంత్రి గారు ఈ విషయంలో రియాక్ట్ అవుతున్నారు అని అంటున్నారు. ఒక దశలో అయన తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని అలోచించారు కూడా. ఆయన విశాఖ రాజధాని వచ్చి తీరాల్సిందే ఇదే తగిన సమయం, ఈ మంచి తరుణం మించినా మళ్లీ రాదు అని ప్రతీ వేదిక మీద చెబుతున్నారు.
అయితే ఆయన చెబుతున్నది బాగానే ఉన్నా కోరస్ గా మాత్రం మేధావుల నుంచి ఎవరూ గొంతు కలపకపోవడమే ఇక్కడ చిత్రం. విశాఖ రాజధాని కోసం ధర్మాన అయితే దూకుడు చేస్తున్నారు. ఆయన మేధావుల ఫోరాన్ని ఏర్పాటు చేయించారు అని చెబుతారు. వెనకాల ఆయన ఉన్నారని అంటారు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని కళాశాల నుంచి ప్రొఫెసర్లు, లెక్చరలకు ఆయన కబురు పంపించారని అంటున్నారు. అయితే వారు మాత్రం పెద్దగా స్పందించడం లేదు అని అంటున్నారు.
మేధావులు ఎవరైనా జేఏసీ యాక్టివిటీ చేయడానికి ముందుకు వస్తే వెనక నుంచి తాను చక్రం తిప్పవచ్చు అని ధర్మాన బాగానే స్కెచ్ వేశారు. కానీ మేధావుల నుంచి మద్దతు కరవు అయింది. ఉత్తరాంధ్రాలో మేధావులకు కొరత లేదు. అనేక ఉద్యమాలు వారు చేసి ఉన్నారు. కానీ విశాఖ రాజధాని విషయంలో మాత్రం వారు ముఖాలు చాటేయడం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిజానికి వారికి ఈ విషయం ఇష్టం లేదా లేక అమరావతి రైతులకు సానుభూతిగా వారు దూరంగా ఉండిపోతున్నారా లేక ప్రభుత్వ విధానాల మీద నిరసనగా మౌనం దాల్చుతున్నారా అన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు.
ఇదిలా ఉంటే మంత్రులుగా ఉంటే ఏపీ మొత్తానికి బాధ్యులుగా వ్యవహరించాల్సిన వరు, తమ శాఖల ద్వారా మేలైన నిర్ణయాలు తీసుకుని అయిదు కోట్ల మంది ప్రజలను అభివృద్ధి వైపుగా నడిపించాల్సిన వారు ప్రజా ఉద్యమాల కోసం ముందుకు రావడం ఏమిటి అని ప్రజలలో చర్చగా ఉంది. ఇదే టైం లో ఉద్యమాలు ఎవరూ నిర్మించలేరని, జనాలలో బాధా, ఆకాన్షలు కనుక ఉంటే వాటంటత అవే బయటకు వెల్లువలా ఎగిసిపడతాయని కూడా అంటున్నారు. మరి ఉత్తరాంధ్రా వాసులకు ఎంతలా ఎగదోసినా సైలెంట్ గా ఉన్నారు అంటే దీని భావమేమి అన్నది ఎవరికి వారే అర్ధం చేసుకోవాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.