తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని డాక్టర్ సునీత కలుసుకున్నారా? ఆమె తన అడ్వకేట్‌తో కలిసి చంచల్ గూడ జైల్లో ఉన్న గంగిరెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారా? అంటే.. దీనిపై ఓ వర్గం మీడియా ఔననే అంటోంది. మిగిలిన చానెళ్లు మాత్రం మౌనంగా ఉన్నాయి. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో కలిసేందుకు సునీత ప్రయత్నించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిన్న మొన్నటి వరకు బెయిల్‌పై ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సునీత న్యాయ పోరా టం చేశారు. దీంతో ఇటీవలే ఎర్ర గంగిరెడ్డిని జైలుకు తరలిస్తూ.. సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తాజాతగా ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు వివేకాకుమార్తె ప్రయత్నించడంతో అసలు ఏం జరుగుతోందనేది ఆసక్తిగా మారింది. అయితే.. జైలు అధికారులు మాత్రం సునీతను అనుమతించలేదని తెలుస్తోంది.
అదేసమయంలో గంగిరెడ్డిని కలుసుకునేందుకు సునీత అడ్వకేట్‌కు అనుమతి ఇచ్చారని తెలిసింది. డాక్టర్ సునీత తరపు న్యాయవాది గంగిరెడ్డితో కొన్ని నిమిషాలు గడిపారని, కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారని సమాచారం. ఇదిలావుంటే, మరోవైపు దస్తగిరి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వివేకానందరెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సునీత జోక్యం చేసుకోవడం కూడా గమనార్హం. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.