ద‌ళిత నేత‌ను ఓన్ చేసుకోవ‌డంలో ప‌వ‌న్ ఫెయిల‌య్యారా?

Update: 2022-02-15 23:30 GMT
ఔను... ద‌ళిత నేత‌ను.. ఓన్ చేసుకుని.. ద‌ళితుల ఓటు బ్యాంకును త‌న‌దైన శైలిలో త‌న‌వైపు తిప్పుకునేం దుకు.. ప్ర‌య‌త్నించిన‌జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌ర్వాత కాలంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారా? అంటే.. ఔననే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎందుకంటే.. ఆయ‌న అంద‌రూ వ‌దిలేసిన నేత‌ను.. పైగా సీమ జిల్లాల కు చెందిన నాయ‌కుడిని భుజాన ఎత్తుకున్నారు.అంతేకాదు.. స‌ద‌రు నేత వివాద ర‌హితుడు.. ఆద‌ర్శ నాయకుడు.. పైగా ద‌ళిత నేత‌. అలాంటి నాయ‌కుడిని ప‌వ‌న్ ఎలివేట్ చేశారు.

ఆయ‌నే.. ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య‌.  పవన్  ఏమ‌నుకున్నారో.. ఏమో కానీ.. సంజీవ‌య్య‌ను ఓన్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే సంజీవయ్య స్మారకం కోసం రూ. కోటి విరాళం ప్రకటించారు. ఆ కోటితో పాటు నిధిని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి ఆయన స్మారకం నిర్మిస్తామన్నారు.

అయితే.. త‌ర్వాత మాత్రం ప‌వ‌న్ ఈ కార్య‌క్రమాన్ని ప‌క్క‌న పెట్టారు. అంతేకాదు.. త‌న ప‌నుల్లో బిజీ అయిపోయారు. వాస్త‌వానికి సంజీవ‌య్య‌ను ఓన్ చేసుకున్న ప‌వ‌న్‌కు ద‌ళితుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంద నే అంచ‌నాలు వ‌చ్చాయి.

అయితే. ఇంత‌లోనే ఆయ‌న ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం. దళిత నేత అయిన సంజీవయ్య ను బీజేపీ పటేల్‌ను ఎలివేట్ చేసిన‌ట్టుగా సంజీవయ్య సేవలను జనసేన ఎలివేట్ చేసుకోవ‌డం అంద‌రినీ ఆక‌ర్షించింది కూడా.

రాజ‌కీయంగా మంచి మైలేజీ కూడా వ‌చ్చేలా చేస్తుంద‌నే విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. అనూహ్యంగా ప‌వ‌న్ మాత్రం దీనిని ప‌క్క‌న పెట్టారు. పైగా..ఇప్పుడు జిల్లాల ఏర్పాటులో భాగంగా క‌ర్నూలు.. జిల్లాకు.. దామోద‌రం సంజీవ‌య్య పేరు పెట్టాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.

ఈ విష‌యంలో పొరుగు రాష్ట్రం తెలంగా ణ నుంచి వీహెచ్‌, గ‌ద్ద‌ర్ వంటివారు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఈ విష‌యంలో ప‌వ‌న్ మాత్రం ఎక్క‌డా రియాక్ట్ కావ‌డం లేదు.

మ‌రి ఆయ‌న సంజీవ‌య్య ట్ర‌స్ట్‌ను ఎందుకు ప్రారంభిస్తాన‌ని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ప‌వ‌న్ దీనికి ఏం చెబుతారో చూడాలి.
Tags:    

Similar News