నిన్న అల్లు అర్జున్.. నేడు బాలకృష్ణ, జానారెడ్డితో మరో సంచలనం!?
ఇందులో భాగంగా.. హైదరాబాద్ లో అక్రమంగా చెరువుల్ని, పార్కుల్ని ఆక్రమించుకున్న వారిపై హైడ్రాతో దిగుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇవాళ బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్ల వరకూ చేరిందని అంటున్నారు!
తెలంగాణలో వరుసగా సంచలనాలు నమోదవుతున్నాయి. మొన్నటి వరకూ మంచు ఫ్యామిలీ వివాదం సంచలనంగా మారగా.. శుక్రవారం మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ హీట్ శనివారం కూడా కంటిన్యూ అవ్వగా.. రాత్రికి బాలకృష్ణ - జానారెడ్డి పేరుతో మరో సంచలనం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
అవును... అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ శనివారం సాయంత్రం మరో విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ లో అక్రమంగా చెరువుల్ని, పార్కుల్ని ఆక్రమించుకున్న వారిపై హైడ్రాతో దిగుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇవాళ బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్ల వరకూ చేరిందని అంటున్నారు!
హైదరాబాద్ లో ఇవాళ బాలకృష్ణతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు స్వల్పంగా మార్కింగ్ వేశారని అంటున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్లాన్ చేసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం అని అంటున్నారు. వీరి ఇళ్లతో పాటు పలు నిర్మాణాలకు హైడ్రా అధికారులు మార్కింగ్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా.. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫార్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లో భాగంగా... రూ.1,090 కోట్లతో ఎనిమిది స్టీల్ బ్రిడ్జ్ లు, ఆరు అండర్ పాస్ ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది సర్కార్! ఇదే సమయంలో.. వారం రోజుల్లో టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమవుతుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అవసరమైన పిల్లర్లు వేయాల్సిన ప్రాంతాల్లో భూ పరీక్షలు జరిపే ప్రాంతాలను అధికారులు గుర్తించి, మార్కింగ్ చేయడం మొదలుపెట్టారని అంటున్నారు.
ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న జానారెడ్డి ఇంటికి సంబంధించిన కాంపౌండ్ వాల్ తో పాటు జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45లోని బాలకృష్ణ ఇంటి భాగంలో కొంత మేర మార్కింగ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో... ఇలా మార్కింగ్ చేసిన భాగాలు భూసేకరణలో పోతాయని అధికారులు చెబుతున్నారని అంటున్నారు!