టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘ‌ట‌న‌లో పోలీసులు పారిపోయారా?

Update: 2022-07-14 04:21 GMT
మే 24న అమెరికాలోకి టెక్సాస్ లోని ఉవాల్డేలో ఉన్న రాబ్ ఎలిమెంట‌రీ స్కూలులో ఒక 18 ఏళ్ల యువ‌కుడు రామోస్ సాల్వ‌డార్ జ‌రిపిన కాల్పుల్లో 21 మంది స్కూలు చిన్నారులు మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కాగా నిందితుడిని గంట త‌ర్వాత పోలీసులు కాల్చిచంపారు. దీంతో అమెరికాలో గ‌న్ క‌ల్చ ర్ పై భారీ ఎత్తున నిర‌స‌న‌లు రేగాయి. పిల్ల‌ల‌కు తుపాకులు ఇవ్వ‌డాన్ని నిషేధించాల‌ని అమెరికా ప్ర‌తినిధుల స‌భ తీర్మానానికి కూడా పూనుకోవాల్సి వ‌చ్చింది.

కాగా ఇప్పుడు ఒక సంచ‌ల‌న వీడియో వైర‌ల్ గా మారింది. టెక్సాస్ లో నిందితుడు స్కూల్ పిల్ల‌ల‌ను కాల్చి చంపుతున్న‌ప్పుడు పోలీసులు స‌కాలంలోనే స్కూలుకు చేరుకున్నారు. అయితే వారు కూడా భ‌య‌ప‌డి నిందితుడికి దూరంగా పారిపోయారు. పోలీసులు పారిపోవ‌డం ఈ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. స్కూల్ లోప‌ల ఘ‌ట‌న జ‌రిగిన నాడు ఏం జ‌రిగింద‌నేది ఈ వీడియో ఫుటేజీలో ఉంది.

దాదాపు 77 నిమిషాల‌పాటు పోలీసులు స్కూలులోనే ఉన్నా నిందితుడిని ఎందుకు ఆప‌లేకపోయార‌ని.. పిల్ల‌ల ప్రాణాలు ఎందుకు కాపాడ‌లేక‌పోయార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు నిమిషాల వీడియో కాల్పుల‌కు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. త‌ర‌గ‌తి గ‌ది హాల్ ద‌గ్గ‌రే పోలీసు అధికారితోపాటు పోలీసులు కూడా సంచ‌రించినా నిందితుడిని ఆపే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోయారు. అంతేకాకుండా అత‌డికి భ‌య‌ప‌డి దూరంగా పారిపోయారు.

అలాగే నిందితుడు భవనంలోకి ప్రవేశించే ముందు పాఠశాలను తన ట్రక్కుతో గుద్దిన‌ట్టు క‌నిపిస్తోంది. హాల్ చివరన ఉన్న తరగతి గదిలోకి ప్రవేశించడానికి గన్‌మ్యాన్ తిరగడంతో ఒక విద్యార్థి పారిపోయాడు. గన్‌మ్యాన్ క్లాస్‌రూమ్‌లో 2 నిమిషాలకు పైగా కాల్పులు జరుపుతున్నట్లు ఆ వీడియోలో వినిపిస్తోంది.

ఇరవై మందికి పైగా అధికారులు తరగతి గది వెలుపల గంటకు పైగా వేచి ఉన్న‌ట్టు వీడియోలో క‌నిపిస్తోంది. కాల్పుల శబ్దం విన్న చాలా మంది అధికారులు తరగతి గది తలుపు నుంచే పారిపోవడం కనిపించింది.

ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆనాడు ఉవాల్డే పోలీసు అధికారుల వ్య‌వ‌హ‌రించిన తీరుపై మ‌రిన్ని ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తింది. ఆ ఘ‌ట‌న గురించి పోలీసు అధికారులు ఇప్ప‌టివర‌కు 12 సార్లు మాట మార్చి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు చెప్పార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ మాట్లాడుతూ.. ఆ వీడియోతో పాటు ఆడియోను కూడా విడుదల చేయాల్సి ఉంది. ఆ రోజు ఏం జ‌రిగిందో ప్ర‌జ‌లు తెలుసుకోవాల్సి ఉంద‌ని ఆయ‌న అన్నారు.


Full View

Tags:    

Similar News