అయ్య‌య్యో.. అవంతీ.. చేజేతులా చేసుకున్నారే...!

Update: 2022-12-31 07:30 GMT
కొంద‌రు అంతే!  చేజేతులా చేసుకుని త‌మ ప్ర‌భావాన్ని పోగొట్టుకుంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గెలిచే వారికి మాత్ర‌మే టికెట్లు ఇవ్వాల‌ని చెప్పేస్తున్న విష‌యం తెలిసిందే.  ఈ క్ర‌మంలో వివాదాలు.. విభేదాల్లో ఉన్న నాయ‌కుల‌ను ఆయ‌న ప‌క్క‌న పెట్ట‌డం ఖాయం. ఇలా చూసుకుంటే.. ఇప్ప‌టికే తాడికొండ ఎమ్మ‌ల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవిని ప‌క్క‌న పెట్టేశారు. ఇక‌, ఇప్పుడు విశాఖ జిల్లాకు చెందిన బీమిలి ఎమ్మెల్యే  మాజీ మంత్రి అవంతి శ్రీనివాస‌రావు ప‌రిస్థితి కూడా సంక‌టంగానే మారింద‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల ఆయ‌న‌ను పార్టీ బాధ్య‌త‌ల నుంచి కూడా త‌ప్పించారు. త‌ర్వాత ప్రాధాన్యం లేకుండా చేశార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. దీనికి కార‌ణం వ‌రుస వివాదాలేన‌ని అంటున్నారు. గ‌తంలో గంట‌.. అంటూ ఒక ఆడియో క్లిప్ రాగా.. త‌ర్వాత జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌విని కోల్పోయారు.  కొన్నాళ్ల కింద‌ట‌ మ‌రో ఆడియో కూడా క‌ల‌క‌లం రేపింది. హైద‌రాబాద్‌లో ఉన్న లేడీ ఫ్రెండ్‌కు అవంతి ఫోన్ చేశార‌నే సంభాష‌ణ‌లు క‌ల‌క‌లం రేపాయి. ఈ ప‌రిణామాల త‌ర్వాత పార్టీలో కీల‌క బాధ్య‌త‌ల నుంచి ఆయ‌న‌ను త‌ప్పించారు.

ఈ రెండు ఘ‌ట‌న‌ల‌ను పార్టీ అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకుంద‌ని అంటున్నారు. అయితే.. పైకి మాత్రం ఎక్క‌డా స్పందించ‌లేదు. కాపు నాయ‌కుడు కావ‌డంతో ఆ వ‌ర్గంలో ఎక్క‌డైనా ఇబ్బంది వ‌స్తుంద‌ని వైసీపీ భావిస్తున్న‌ట్టుగా ఉంది. అయితే.. తెర‌వెనుక మాత్రం ఆయ‌న‌కు వాత‌లు పెడుతోంద‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే  ఆయ‌న‌కు ప‌ద‌వీ భంగం క‌లిగింద‌నే ప్ర‌చారం ఉంది. మ‌రోవైపు.. విశాఖ‌ప‌ట్నంలోని ముఖ్య‌నాయ‌కుల‌కు, అవంతికి మ‌ధ్య గ్యాప్ అలానే ఉంది. త‌న‌ను విజ‌య‌ సాయిరెడ్డి డామినేట్ చేస్తున్నార‌ని, అప్పట్లో మంత్రిగా ఉన్నా.. త‌న‌ను ప‌ట్టించుకోలేద‌ని అనేవారు.

ఇప్పుడు ఉత్త‌రాంధ్ర జిల్లాల బాధ్య‌త‌ల‌ను వైవీ సుబ్బారెడ్డికి అప్ప‌గించారు. పోనీ  ఆయ‌నైనా అవంతి విష‌యంలో సానుకూలంగా ఉన్నారా? అంటే, లేదు. క‌నీసం ఆయన కార్య‌క్ర‌మాల‌కు కూడా పిల‌వ‌డం లేదు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మాజీ మంత్రి అవంతికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు క‌ష్ట‌మ‌నే వాద‌న‌ వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే, ఆయ‌న‌కు పార్టీలు మార‌డం కొత్త‌కాదు. గ‌తంలో టీడీపీ, త‌ర్వాత ప్ర‌జారాజ్యం, త‌ర్వాత టీడీపీ, ఇప్పుడు వైసీపీ. సో.. రేపు మ‌ళ్లీ టీడీపీలోకి వెళ్లినా వెళ్లొచ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News