దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్యోదంతం గురించి తెలిసిందే. ఈ దారుణ హ్యతాచార కేసు నిందితుల్లో ఒకడు చెన్నకేశవులు. ఇతగాడి నేరం ఎంత పెద్దదో.. అతడి వ్యక్తిగత జీవితంలోనూ ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకోవటమే కాదు.. గర్భవతిని చేసిన వైనం చాలామందిని విస్మయానికి గురి చేసింది.
దిశ హత్యోదంతం జరిగిన సమయంలో ఆమె ఆర్నెల్ల గర్భవతి గా ఉన్నారు. పన్నెండేళ్లకే ఆమెకు పెళ్లి కాగా.. పద్నాలుగేళ్లకే ఆమె ప్రసవమైంది. ఈ రోజు ఉదయం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆమెకు నొప్పులు వచ్చాయి. తొమ్మిది నెలలు నిండిన ఆమెకు సాధారణ ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యాధికారులు ప్రయత్నించారు. అయినా.. సాధ్యం కాకపోవటంతో డాక్టర్ రాధ అధ్వర్యంలో శస్త్రచికిత్స చేశారు.
రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ పరిస్థితి బాగుందని వైద్యులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన ఆమె ఉదంతం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.