నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మరోసారి వైసీపీ పోరుబాటు పెట్టింది. ఆయనపై అనర్హత వేటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రఘురామపై అనర్హత వేటు వేసేందుకు ఏపీ అధికార పార్టీ వైసీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. తమ పార్టీ టికెట్ పై గెలిచి ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. రఘురామకృష్ణంరాజు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ ఇప్పటికే అనేకసార్లు స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది.
వైసీపీ లోక్ సభ చీఫ్ విప్ మార్గాని భరత్ తాజాగా మరోసారి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం విశేషంగా మారింది. మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంపై గతంలోనే ఆధారాలతో సహా లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామను వెంటనే అనర్హుడిని చేయాలని ఈరోజు మరోసారి స్పీకర్ కు ఫిర్యాదు చేశామని భరత్ తెలిపారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రఘురామ సీఎంజగన్ కు, ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. మీడియాలో రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయనపై రాజద్రోహం కేసులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలయ్యాయి.
అయినా కూడా రఘురామ తీరు తగ్గకపోవడంతో తాజాగా మరోసారి ఆయనపై అనర్హత అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. రఘురామ ఎంపీ సీటును తొలగించడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది.