ఇపుడు ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. మరో వైపు చూస్తే కొత్త జిల్లాల నోటిఫికేషన్ తో ప్రభుత్వం చాలా పెద్ద పనే రాజకీయ పార్టీలకు అప్పచెప్పింది. అయితే దీని మీద రాజకీయ రణగొణ ద్వనులతో పాటు సామాజిక వర్గ నేతలు, ఆయా నాయకుల ఫ్యాన్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు కూడా కొత్త జిల్లాల పేర్ల విషయంలో చురుకుగా స్పందిస్తున్నారు.
విజయవాడకు తెలుగు వారి ఇలవేలుపు ఎన్టీయార్ పేరు పెడుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వంగవీటి రంగా అభిమానులు అలెర్ట్ అయ్యారు. ముందుగా రంగా రాధా మిత్రమండలి తరఫున ఆయన కుటుంబ సభ్యుడు అయిన వంగవీటి నరేంద్ర ఫస్ట్ డిమాండ్ చేశారు. రంగా పేరును విజయవాడకు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రంగా తాడిత పీడిత జనాల కోసం పాటుపడ్డారని, ఆయన పేరుతో విజయవాడను కలిపితే అందరికీ సంతృప్తిగా ఉంటుందని చెప్పారు.
ఇపుడు విశాఖలోని రంగా అభిమాన సంఘం నేతలు మీడియా ముందుకు వచ్చారు. రంగా పేరు విజయవాడకు పెట్టాల్సిందే అని వరు గట్టిగా కోరుతున్నారు. రంగా అభిమాన సంఘం తరఫున గాదె బాలాజీ మాట్లాడుతూ రంగా ఒక సామాజికవర్గానికి మాత్రమే చెందిన వారు కారు, ఆయన అన్ని వర్గాల ప్రతినిధి, ప్రధానంగా ఆయన క్రిష్ణ లంకలోని పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని కోరుతూ అమరణ దీక్షకు కూర్చున్నారని, ఆ ప్రయత్నంలోనే దారుణ హత్యకు గురి అయ్యారని గుర్తు చేశారు. అందువల్ల రంగాకు నివాళిగా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని కోరారు.
ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కూడా సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు వర్గాలకు ఆరాధ్యుడిగా ఎదిగిన రంగా పేరుని విజయవాడకు పెట్టడం ద్వారా కొత్త జిల్లాకు సార్ధకత ఉండేలా చేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా ప్రభుత్వానికి తగిన రీతిన సూచన చేయాలని కోరడం విశేషం.
ఇక రంగా పేరుని విజయవాడకు పెట్టాలని కోరుతూ త్వరలొనే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా తాము చేయబోతున్నట్లుగా ఆయన పేర్కొనడం విశేషం. అదే విధంగా మంత్రులకు, జిల్లా కలెక్టర్లకు కూడా వినతిపత్రాలను అందిస్తామని ఆయన చెప్పారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాకు కోడి రామమూర్తి పేరు పెట్టాలని మరో డిమాండ్ ని రంగా అభిమానులు చేస్తుతున్నారు.
మొత్తానికి కొత్త జిల్లాల పేర్లు కాదు కానీ రాజకీయ రచ్చ సాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది చూడాలి. బెజవాడ కనకదుర్గమ్మ అందరికీ తల్లి అని, అలాగే విజయవాడలోని అన్ని కులాలకు రంగా ఆత్మీయుడు అని ఆయన అభిమానులు చెబుతున్నారు. మొత్తానికి రంగా పేరు పెట్టాలను కోరుతూ ముందు ముందు మరిన్ని డిమాండ్లతో పాటు భారీ ఉద్యమమే వస్తుందని అభిమానుల మాటలను బట్టి అర్ధమవుతోంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో.