ఫోన్ ట్యాపింగ్..తెలుగు రాష్ర్టాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఇదే తరహా సీన్ పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో చోటుచేసుకుంది. శాసనసభ ఎన్నికల సమయంలో కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే నుంచి బయటకు వచ్చి ‘మక్కల్ డీఎండీకే’ను ఏర్పాటు చేసిన ఆ పార్టీ కన్వీనర్ చంద్రకుమార్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. డీఎండీకేలోని ఇతర నేతలను ఆ పార్టీ నుంచి బయటకు రమ్మంటూ చేసినట్టుగా చెబుతున్న ఫోన్ కాల్ వివరాలు బయటకు పొక్కడం వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా ‘‘డీఎంకేలోకిగానీ, అన్నాడీఎంకేలోకిగానీ వెళ్లండి.... మనకు ఎక్కడ బాగుంటుందో అక్కడకు వెళ్లడంలో తప్పులేదన్నట్టుగా’’ ఆ రికార్డింగ్ లో ఆయన పేర్కొన్నట్లు ఉండటం కూడా చంద్రకుమార్ ను ఇరకాటంలోకి నెట్టింది. మరోవైపు మక్కల్ డీఎండీకేలో ఉన్న మరో నేత ఎస్ ఆర్ పార్తిబన్ కూడా రాజేంద్రనాథ్‌కు ఇదేవిధంగా ఫోన్ చేసి పార్టీ మారమంటూ సూచనలు ఇచ్చారంటూ కొన్ని ఆధారాలు కూడా బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ప్రజా సంక్షేమ కూటమితో డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ చేతులు కలపడంపై పార్టీలోని కొందరు నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పార్టీ నేత చంద్రకుమార్ తొలుత బయటకు వచ్చారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది నేతలు కూడా వచ్చి ‘మక్కల్ డీఎండీకే’ను స్థాపించారు. ఎన్నికలకు కొన్ని రోజులే ఉన్న తరుణంలో స్టాలిన్ ను కలసి తమ మద్దతును ప్రకటించి - డీఎంకే తరఫున రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్నారు. కానీ రెండో చోట్లా వారు ఓడిపోయారు. అయినప్పటికీ ఎన్నికల తర్వాత డీఎండీకే నుంచి వలస వెళ్లే నేతల సంఖ్య పెరిగింది. దీంతో అలాంటి నేతలందరితోనూ కలసి చంద్రకుమార్ నేతృత్వంలోని ‘మక్కల్ డీఎండీకే’ను డీఎంకేలో విలీనం చేసే కార్యక్రమాన్ని త్వరలోనే సేలంలో వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో డీఎండీకేలో ఉన్న ఇతర నేతలను కూడా బయటకు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు చంద్రకుమార్. అందులో భాగంగా డీఎండీకే నేత - నటుడు రాజేంద్రనాథ్ కు ఇటీవల చంద్రకుమార్ ఫోన్ చేశారని సమాచారం. డీఎండీకేలో భవిష్యత్తు పెద్దగా ఉండదని; డీఎంకేలోగానీ - అన్నాడీఎంకేలోగానీ చేరమంటూ చెప్పినట్లు తెలిసింది. ఎక్కడ బాగుంటే అక్కడకు వెళ్లడంలో తప్పులేదని అన్నారని సమాచారం. డీఎంకేలో చేరుతానంటే ఎంపీ కనిమొళి పీఏతో మాట్లాడిస్తానని కూడా చెప్పారని వార్తలు వచ్చాయి. ఇదేవిధంగా మరో నేత ఎస్ ఆర్ పార్తిబన్ కూడా రాజేంద్రనాథ్ తో మాట్లాడినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. వీరిద్దరికీ కొద్దిసేపు తర్వాత తన నిర్ణయం చెబుతానంటూ రాజేంద్రనాథ్ కాల్ కట్ చేశారని సమాచారం. తీరా ఆ సంభాషణ రికార్డింగ్ ఫైల్ ను డీఎండీకే అధిష్ఠానానికి ఆయన ఇచ్చినట్లు తెలిసింది. తమ పార్టీని భూస్థాపితం చేయాలన్న ఉద్దేశంతోనే వీరు ఇలా కక్ష కట్టుకుని వ్యవహరిస్తున్నారంటూ డీఎండీకే అధిష్ఠానం ఆరోపణలు చేసింది.
ఈ విషయమై డీఎండీకే ఉన్నతస్థాయి కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ.. డీఎంకే - అన్నాడీఎంకేలు డీఎండీకే లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా డీఎండీకేకు ఏమీ కాదని, ప్రజల్లో తమ పార్టీకి ఇంకా మంచి ఆదరణ ఉందన్నారు. మరోవైపు ఈ సంభాషణ విడుదలైన విషయంపై చంద్రకుమార్ స్పందిస్తూ.. వాస్తవానికి తాను ముందుగా రాజేంద్రనాథ్‌కు ఫోన్ చేయలేదని, ఆయనే తనకు ఫోన్ చేశారని చెప్పారు. డీఎంకేలో చేరేందుకు సంబంధించి త్వరలోనే పెద్దఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, దాన్ని చెడగొట్టేందుకే ఇలా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రకుమార్ మాటలను రాజేంద్రనాథ్ తిప్పికొట్టారు. ఆ సంభాషణలను పూర్తిగా వింటేనే ఎవరు ఫోన్ చేశారో పూర్తిగా అర్థమవుతుందని తెలిపారు.