ఎన్ కౌంటర్ చేయొద్దు.. జైల్లో వేయండి.. యోగి ఎఫెక్టు ఇది!

Update: 2022-03-18 04:34 GMT
అందరి అంచనాలకు తగ్గట్లే యూపీలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు యోగి ఆదిత్యనాథ్ రెండోసారి యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 21న ఆయన ప్రభుత్వం మరోసారి కొలువు తీరనుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనే.. తాము మరోసారి అధికారాన్ని చేపట్టిన వెంటనే.. ప్రొక్లెయిన్లను బయటకు తీస్తామని.. నేరస్తుల్ని ఏరివేస్తామంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చేయటం తెలిసిందే.

నిజానికి యోగి ఐదేళ్ల పాలనలో పెద్ద ఎత్తున నేరస్తుల్ని ఎన్ కౌంటర్ చేయటంతో పాటు.. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయాన్ని కలిగించటంలో సక్సెస్ అయ్యారు. దీంతో.. నేరాల రేటు కూడా తగ్గిందన్న మాట పెద్ద ఎత్తున వినిపించింది. యోగి గెలుపులో ఇది కూడా ఒక కారణంగా చెబుతారు.  ఇదిలా ఉంటే.. యోగి సర్కారు కొలువు తీరనున్న నేపథ్యంలో.. క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. బతికి ఉంటే బలుసాకు తినొచ్చన్నట్లుగా వారి తీరు ఉంది.

ఇంత కాలం బేఫికర్ గా తిరిగిన వారు.. యోగి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే.. భారీ ఎత్తున ఎన్ కౌంటర్లు ఉంటాయన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీంతో.. వణికిపోతున్న క్రిమినల్స్ ను చావు భయం వెంటాడుతోంది. అందుకే.. కొందరు ఊహించని తీరులో రియాక్టు అవుతున్నారు.

తాజాగా ఒక నేరస్తుడు తనను వెంటనే అరెస్టు చేయాలని పోలీసుల్ని వేడుకుంటున్నాడు. ఎందుకంటే.. యోగి సర్కారు అధికారంలోకి వచ్చినంతనే తనను ఎన్ కౌంటర్ చేస్తారన్న సందేహంతో తనకు తానుగా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయాడు.

గౌతమ్ సింగ్ అనే వ్యక్తి ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇంతకాలం బయట తిరిగిన అతను.. ఇప్పుడు మాత్రం పోలీస్ స్టేషన్ కు వచ్చి.. తనకు తానుగా లొంగిపోతున్నానని.. తనను అరెస్టు చేయాలని.. జైలుకు పంపాలని.. అంతే తప్పించి తనను మాత్రం చంపొద్దంటూ ప్లకార్డు పట్టుకొని మరీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ లొంగిపోవటం గమనార్హం.

యోగి ఎపెక్టు ఎలా ఉంటుందన్న దానికి ఈ ఉదంతం ఒక నిదర్శనంగా చెబుతున్నారు. ప్రమాణస్వీకారానికి టైం దగ్గర పడే కొద్దీ ఇలాంటి పలు ఉదంతాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
Tags:    

Similar News