ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తోంది. అయితే కేసుల సంఖ్యను చూసి తగ్గిందని నిర్లక్ష్యం వహించొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్‌ను చూపిస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా యూరప్ దేశాల్లో సెకండ్ వేవ్ మొదలైంది. మన దేశంలో కూడా మహమ్మారి రెండోసారి తిరిగి విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మరో మారు పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కేరళలో ఓనం పండగ తర్వాత కూడా పాజిటివ్ కేసుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగింది.
అయితే ఓ సారి కరోనా వచ్చినవారికి మరోసారి రాదని కొందరు భ్రమల్లో ఉన్నారు. అయితే అది ఏ మాత్రం నిజం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా రెండోసారి కూడా సోకవచ్చని చెబుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్నాక శరీరంలో ఐదు నెలల లోపు యాంటీబాడీలు ఉండే అవకాశం ఉంది. కానీ శరీరతత్వాన్ని బట్టి కొందరిలో యాంటీ బాడీస్ తగ్గిపోతున్నాయి. దీనివల్ల కరోనా రెండోసారి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి కేసులు ప్రపంచ వ్యాప్తంగా 24 నమోదైనట్టు సమాచారం. ఇండియాలో మూడు రీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్టు ఐసీఎమ్ఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలియజేశారు. అహ్మదాబాద్ లో ఒకటి, ముంబైలో రెండు రీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. కరోనాను ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దని విధిగా మాస్కులు ధరించాలని, నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.