ట్రంప్ దంపతులకి తాజ్ గొప్పదనం చెప్పింది ఎవరంటే ?

Update: 2020-02-25 06:44 GMT
డోనాల్డ్ ట్రంప్ ..ప్రపంచ దేశాల పెద్దన్న. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్. ప్రస్తుతం ప్రెసిడెంట్ ట్రంప్ భారత్ లో పర్యటిస్తున్నారు. మోడీ పిలుపుమేరకు భారత్ పర్యటనకి కుటుంబం తో సహా వచ్చిన ట్రంప్ ..ప్రస్తుతం ఇండియా లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అమెరికా నుండి రాగానే ..నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ..ఆ తరువాత ఆగ్రా లోని తాజ్ మహల్ ని చూడటానికి వెళ్లారు.

ట్రంప్ , అయన భార్య మెలానియాలు తాజ్ అందాలను వీక్షిస్తున్న సమయంలో వారికీ గైడ్‌ గా నితిన్ కుమార్‌ సింగ్ వ్యవహరించారు. ఆయన ట్రంప్‌ కే కాకుండా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర ప్రముఖులకు తాజ్ గొప్పతనం గురించి వివరించారు. నితిన్ తాజ్ ఘనత గురించి, దాని వెనుకనున్న ప్రేమ కథను చెప్తున్నంత సేపూ ట్రంప్ , అయన భార్య ఎంతో శ్రద్దగా ఉన్నారు.

దీనిపై గైడ్ నితిన్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌ దంపతులు తాజా మహల్‌ ను చూసి సంతోషం వ్యక్తం చేసారు అని చెప్పారు. అదొక అద్భుత కట్టడం అని ట్రంప్‌ దంపతులు చెప్పినట్లు నితిన్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. అలాగే మరొకసారి ఖచ్చితంగా తాజ్‌ మహల్‌ ను వీక్షించడానికి వస్తామని వారు చేపినట్లు తెలిపారు. గతంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్మాగిన్ బతుల్గా, బెల్జియం రాజు ఫిలిప్‌లకు తాజ్ మహల్‌ గురించి వివరించిన ఘనత నితిన్‌ కుమార్‌ సింగ్‌ది. ప్రధాన నరేంద్ర మోదీ కి ఎంతో ఇష్టమైన నితిన్‌ సింగ్‌.. ఎక్కువ శాతం ప్రముఖులకి మాత్రమే గైడ్‌ గా వ్యవహరిస్తారు. తాజ్‌ మహల్‌ విశిష్టత గురించి చెప్పడంలో ఆగ్రాకు చెందిన నితిన్‌ సింగ్‌ కి సాటి ఎవరు రారు అని స్థానికులు చెప్తుంటారు.
Tags:    

Similar News