ఏపీలో రాజకీయం మార్చే శక్తి పొత్తులకు ఉందా అంటే ఉంది అని బల్లగుద్ది చెప్పే లెక్కలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ తాను బలంగా ఉన్నాను అనుకుంటోంది. తనను ఎవరూ ఏమీ చేయలేరని కూడా ధీమాగా అంటోంది. యాభై శాతం ఓట్ల షేర్ తో పాటు 151 సీట్లతో ఉన్న వైసీపీని గద్దె దించాలంటే ఎవరి తరం కాదా అన్న ప్రశ్నలకు కళ్ళ ముందే జవాబు ఉంది. లెక్కలు కూడా పక్కాగా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
ఏపీలో 2019 ఎన్నికలనే ప్రమాణంగా తీసుకుంటే అప్పట్లో టీడీపీకి 39 శాతం ఓట్ల షేర్ లభించింది. ఇక జనసేనకు ఆరు శాతం, బీజేపీకి ఒక శాతానికి అటు ఇటుగా ఓట్ల షేర్ లభించింది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ కి 50 శాతం ఓట్ల షేర్ వచ్చింది. ఇపుడు రాజకీయ విశ్లేషణలను చూడాల్సిన అవసరం ఉంది.
ఏపీలో జగన్ సర్కార్ 2024 నాటికి అయిదేళ్ల ప్రభుత్వాన్ని పూర్తి చేసుకుంటుంది. అంటే ఎంత గొప్ప మెజారిటీతో గెలిచినా ఎంత పెద్ద ఎత్తున ఓట్ల షేర్ వచ్చినా కూడా ఆ పార్టీకి కచ్చితంగా యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దాంతో పాటు ప్రతీ ఎన్నికకూ ప్రభుత్వాన్ని మార్చాలనుకునే తటస్థ వర్గం ఉంటారు. వారు న్యూట్రల్ జనాలుగా చూడాలి. మరి ఈ న్యూట్రల్ జనాలే 2024 లో కీలకమైన పాత్ర పోషిస్తారు అని అంటున్నారు.
ఈ న్యూట్రల్ ఓట్లు కనుక వైసీపీకి ఒక నాలుగైదు శాతం తగ్గితే అపుడు యాభై శాతం ఓట్ల షేర్ ఉన్న వైసీపీకి 46 శాతం మాత్రమే ఓట్ల షేర్ దక్కుతుంది. అదే టైంలో ఈ ఓట్ల షేర్ టీడీపీ జనసేన, బీజేపీలకు వెళ్తే అపుడు వారి ఓట్ల షేర్ అమాంతం 50 శాతానికి చేరిపోతుంది. అంటే ఏపీలో రాజకీయ పరిస్థితి అమాంతం మారిపోవడమే కాదు పూర్తిగా తారు మారు అవుతుంది.
ఇపుడు ఇదే వైసీపీకి వ్యూహాలను అందిస్తున్న ప్రశాంత్ కిశోర్ టీం ఆలోచిస్తోంది అని అంటున్నరు. వైసీపీకి 50 శాతం ఓట్ల షేరింగ్ అంటే అది రికార్డు బ్రేక్. మళ్ళీ అంతటి ఓట్ల షేరింగ్ వస్తుందా అన్నది అనుమానం. అదే టైం లో ఈ ఓట్ల షేర్ పెరిగే చాన్స్ ఉంటుందా అంటే అది అలా జరిగితే అద్భుతం అనే అనుకోవాలి. 2019లో పూర్తిగా మొత్తానికి మొత్తం వర్గాలు వైసీపీకి మద్దతుగా నిలిచాయి. ఇపుడు చూస్తే మూడున్నరేళ్ళ కాలంలోనే చాలా వర్గాలలో నిరాశ కనిపిస్తోంది.
దాంతో పాటు సాదరజనంలో పాలన మీద ఎటూ ఎంతో కొంత వ్యతిరేకత ఉండడం తధ్యం. మరి ఈ లెక్కలు విపక్షం వైపు నుంచి చూస్తే వారికి భారీ అడ్వాంటేజెస్ కచ్చితంగా ఉంటాయి. టీడీపీకి 39 శాతం ఏ మాత్రం తగ్గదు పైగా అది మరింతగా పెరిగే చాన్స్ ఉంటుంది. అలాగే జనసేనకు ఆరు శాతం కంటే ఈసారి ఎక్కువగా ఓట్ల షేర్ లభిస్తుంది అని కూడా చెబుతున్నారు. బీజేపీ రెండు నుంచి మూడు శాతానికి తన ఓట్ల షేర్ ని పెంచుకుంటే అదంతా వైసీపీ నుంచే లాక్కోవాల్సిందే.
అంటే ఇక్కడ కీలకమైన విషయం ఏంటి అంటే విపక్షం ఎంతలా ఎదిగితే అంతలా వైసీపీ ఓట్ల షేరింగ్ కి కోత పడుతుంది. అదే టైం లో వైసీపీ కొత్తగా పెంచుకోవడానికి కూడా ఏమీ లేదు. మరి ఈ కోతను, వైసీపీకి తగ్గిపోతున్న ఓట్ల షేర్ ని ఎలా నిలబెట్టాలంటే అది పీకే టీం ఉంది బిగ్ టాస్క్ అనే అంటున్నారు.
ఎక్కడైనా వరసగా రెండవ మారు అధికారంలోకి ఒక ప్రభుత్వం రావాలీ అంటే దానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతేనే సాధ్యపడుతుంది. అలా కాకుండా సాలిడ్ గా విపక్షం అంతా ఒకే వైపు నిలబడి కలబడితే మాత్రం అధికార పార్టీకి ఎపుడూ కష్టమే, నష్టమే. ఏపీలో విపక్షం అంతా ఒక్కటిగా వస్తే మాత్రేం వైసీపీకి భంగపాటు తప్పదన్న అంచనాలు ఎటూ ఉన్నాయి. ప్రస్తుతం దీని మీదనే స్టడీ చేస్తున్న పీకే టీం వైసీపీకి ఇచ్చే సలహా సూచనలు ఏంటో చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.