నాడు బూట్లు కొనే స్థితిలో లేని క్రీడాకారుడు నేడు టాప్ బౌలర్ ఎవరో తెలుసా?

Update: 2021-04-14 00:30 GMT
పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ నడుమ జరిగిన పోరులో ఓ యువ కెరటం ఎగిసిపడింది. తనదైన ప్రతిభతో దిగ్గజ బ్యాట్స్ మెన్ల వికెట్లు తీశాడు. రెండో ఓవర్లోనే ఓపెనర్ మయాంక్ వికెట్... టాప్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ శతకానికి దగ్గరగా ఉన్న సమయంలో ఔట్ చేశాడు. రిచర్డ్ సన్ వికెట్ ను కూడా తీశాడు. అంతేకాకుండా తనదైన రీతిలో ఫీల్డింగులోనూ సత్తా చాటాడు. అతనే 23 ఏళ్ల చేతన్ సహకారియా. ప్రస్తుతం అందరి చూపు అతనిపైనే పడింది.

స్వశక్తితో ఎదిగిన కెరటం
గుజరాత్ లోని కుగ్రామం వార్టెజ్ లో అతిపేద కుటుంబంలో జన్మించాడు చేతన్. చిన్నప్పటి నుంచి క్రికెట్ పై ఎనలేని ప్రేమ పెంచుకున్నాడు. అందుకే స్వశక్తితో సాధన చేసి ఎదిగాడు. మొదట్లో బ్యాట్స్ మెన్ గా రాణించిన అతను ఆ తర్వాత పాఠశాలలో పేరు సంపాదించుకోవాలని నైపుణ్యం పెంచుకొని బౌలర్ గా మారాడు. 16 ఏళ్ల వరకు ఏ విధమైన శిక్షణ లేకుండా యువకెరటం చేతన్.

బూట్లు కొనలేని స్థితి
కుటుంబ పోషణ కోసం మేనమామ వ్యాపారాలు చూసుకుంటూ ఆటపై పట్టు సాధించాడు. అనంతరం ఎమ్ఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దిగ్గజ క్రీడాకారుడు ఫేసర్ మెక్ గ్రాత్ దగ్గర శిక్షణ పొందాడు. ఆ ఫౌండేషన్ కు వెళ్లేముందు కనీసం బూట్లు కొనుక్కోలేని స్థితిలో ఉన్నాడు. ఇతడి ఆట శైలికి ఫిదా అయిన బ్యాట్స్ మెన్ షెల్డన్ జాక్సన్ బూట్లు కొనిచ్చాడు.

చేతన్ ప్రస్థానం
 క్రికెట్ లో పట్టు పెంచుకొని క్రమంగా ఎదిగాడు. 17 ఏళ్ల వయసులో గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్నాడు. తొలుత సౌరాష్ట్ర తరఫున జూనియర్ జట్టుకు ఎంపికయ్యాడు.  ఈ ఏడాది రూ.1.2కోట్ల ధరతో రాజస్థాన్ జట్టుకు ఎంపికయ్యాడు.  తొలి మ్యాచ్ తోనే అందరి చూపులను తనవైపు తిప్పుకున్నాడు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని అతి పేద కుటుంబం నుంచి పైకి ఎదిగిన చేతన్ ప్రస్థానం నిజానికి ఎంతో మందికి ఆదర్శం.   
Tags:    

Similar News