గ్రేటర్ లో పవన్ను ఎందుకు బీజేపీ దూరం పెట్టేసిందో తెలుసా ?

Update: 2020-11-29 18:20 GMT
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో పోటీ చేయటానికి మాత్రమే జనసేన దూరంగా ఉండటం కాదు. చివరకు బీజేపీ అభ్యర్ధుల ప్రచారానికి కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూరంగా ఉండిపోయారు. అని అందరు అనుకుంటున్నా అసలు విషయం మాత్రం వేరే ఉందట. ఇంతకీ విషయం ఏమిటంటే గ్రేటర్ ఎన్నికల్లో జనసేనను పోటీ చేయనీయకుండా విత్ డ్రా చేయించిన విషయం అందరికీ తెలిసిందే. నామినేషన్లకు రెడీ అయిపోయిన అభ్యర్ధుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ జనసేనానితో మాట్లాడారు.

కిషన్-పవన్ భేటి తర్వాత తమ అభ్యర్ధులు పోటీ నుండి విత్ డ్రా చేసుకుంటున్నట్లు పనవ్ ప్రకటించారు. అలాగే బీజేపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలంటు పిలుపుకూడా ఇచ్చారు. సరే బేజేపీ నేతల రిక్వెస్టు మీద ఓట్లు చీలకుండా తమ అభ్యర్ధులను విత్ డ్రా చేయించానని పనవ్ చెప్పటం వరకు బాగానే ఉంది. కానీ ముందుగా చెప్పినట్లు తర్వాత ప్రచారంలో ఎక్కడా పవన్ ఎందుకు కనబడలేదు ? ఆదివారం సాయంత్రంతో ముగిసిన ప్రచారంలో ఎక్కడా కనీసం ఒక్క డివిజన్లో కూడా ప్రచారం చేయలేదు.

పైగా అర్జంటుగా పవన్ను ఢిల్లీకి పిలిపించుకున్నారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఎందుకు పిలిపించుకున్నారంటే బహుశా నడ్డా కూడా సమాధానం చెప్పలేరేమో. ఎందుకంటే మూడు రోజులు పవన్ను ఖాళీగా కూర్చోబెట్టేశారు. సరే తర్వాత హైదరాబాద్ కు తిరిగొచ్చిన తర్వాతయినా ప్రచారానికి ఎందుకు రాలేదు ? ఎందుకంటే పవన్ ప్రచారం చేయటం వల్ల బీజేపీకి నష్టం ఉంటుందని బీజేపీ నేతలు అనుమానించారని సమాచారం.

ఎలాగంటే పవన్ గనుక ప్రచారంలోకి దిగితే మళ్ళీ సీమాంధ్ర పార్టీల పెత్తనమంటు కేసీయార్ ప్రాంతీయ వాదాన్ని తీసుకొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చిపోతారని భయపడ్డారట. జనాలు కూడా కేసీయార్ మాటలు నమ్మితే తమకు నష్టం జరుగుతుందని అనుకున్నారట. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు అప్పటికే ఓ వ్యూహం ప్రకారం మతం అంశాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చేశారు. పవన్ గనుక ప్రచారంలోకి దిగితే తాము లేవనెత్తిన మయం అంశాన్ని కేసీయార్ ప్రాంతీయ వాదంతో ఎదుర్కొంటారని భయపడ్డారట. అందుకనే చివరకు పవన్ను ప్రచారానికి కూడా కమలం నేతలు దూరం పెట్టేశారని వినికిడి.


Tags:    

Similar News