'గాంధీ' లో అద్భుతం చేసిన డాక్టర్లు ... బ్లాక్ ఫంగస్ ని శస్త్రచికిత్స ద్వారా .. !
దేశంలో ఓ వైపు కరోనా..మరోవైపు బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా నుండి కోలుకున్న చాలామంది బ్లాక్ ఫంగస్ భారిన పడుతుండటం తో అందరిలో ఆందోళన ఎక్కువ అవుతోంది. ఇదిలా ఉంటే .. తాజాగా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో వైద్యులు చరిత్ర సృష్టించారు. బ్లాక్ ఫంగస్ భారిన పడి , ప్రాణాలు కోల్పోయేలా ఉన్న పేషేంట్ కేసును ఛాలెంజ్ గా తీసుకోని దాదాపుగా నాలుగు గంటల పాటు కష్టపడి ఆపరేషన్ చేసి అతడి ప్రాణాలు నిలిపారు. గాంధీ ఆస్పత్రిలోని ఐదు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు సుదీర్ఘ శస్త్రచికిత్స జరిపి విజయం సాధించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, బ్లాక్ ఫంగస్ సర్జరీ కమిటీ చైర్మన్ శోభన్‌బాబు ఆదేశాల మేరకు ఆర్‌ఎంవో–1 నరేందర్ వివరాలు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే .. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ తో బాధపడుతూ ఈనెల 19న గాంధీ హాస్పిటల్ లో చేరాడు. ఎడమ దవడ వాయ డంతో పాటు ఎడమ కన్ను పూర్తిగా కనిపించట్లేదు. కుడికన్ను కొంచెం కనిపిస్తోంది. ముఖంలోని పలు భాగాలకు ఫంగస్ వేగంగా విస్తరిస్తోందని గుర్తించారు. ఈఎన్ టీ, ఆప్తాల్మాలజీ, పాస్లిక్ సర్జరీ, అనస్థీషియా, న్యూరోసర్జరీ వైద్యుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25న సుమారు 4 గంటల పాటు శ్రమించి ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. ఎడమ కన్నుతో పాటు, ముఖ భాగంలోని మాగ్జి లా ఎముకను తెరిచి ఫంగస్ ను తొలగించారు. ఇన్ ఫెక్షన్ సోకిన భాగాలను కొంతమేర తొలగించి, శుభ్రపరిచారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నాడు. బ్లాక్ ఫంగస్ నియంత్రణకు పొసకొనజోల్ మందు ఇచ్చామని, ఇది అద్భుతంగా పనిచేసిందని వైద్యులు చెప్పారు. రోగి పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ద్వా రా ఆయా భాగాలను పునరుద్ధరిస్తామన్నారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో ప్లాస్టిక్ సర్జరీ, ఆప్తా ల్మాలజీ హెచ్‌ఓడీలు సుబోధ్ కుమార్, రవిశేఖర్, పలు విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు.