ప్రవాస భారతీయులకు(ఎన్నారై) ఒకే వేదిక ద్వారా స్వదేశంలో అన్ని రకాల సేవలందించేందుకు ఎన్ ఆర్ ఐ హిత.కామ్ అనే పోర్టల్ ప్రారంభమైంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన ఈ పోర్టల్...విదేశాల్లోని భారతీయులకు స్వదేశంలో ఆస్తుల నిర్వహణ - సంరక్షణ - లీగల్ అడ్వైజరీ - కంపెనీ రిజిస్ట్రేషన్ - పన్ను రిటర్నుల ఫైలింగ్ వంటి ఎక్స్ క్లూజివ్ సర్వీసులతోపాటు కరెంట్ - టెలిఫోన్ బిల్లులు - స్కూల్ లేదా కాలేజీ ఫీజు - స్థిరాస్తి పన్ను చెల్లింపుల సేవలు కూడా అందించనుంది. పార్సిల్ - కొరియర్ సర్వీసులు సైతం పొందవచ్చు.
వీటితో పాటు భారత్ లో నివసిస్తున్న ఎన్నారైల తల్లిదండ్రులు లేదా వారిపై ఆధారపడిన వారికి వ్యక్తిగత సేవలు సైతం అందించనున్నట్లు ఎన్ ఆర్ ఐ హిత.కామ్ వ్యవస్థాపకులు - సీఈవో కే రాజిరెడ్డి తెలిపారు. తొలుత హైదరాబాద్ కేంద్రంగా సేవలు ప్రారంభిస్తున్నట్లు, క్రమంగా తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన నగరాలు - పట్టణాలకు విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ వెబ్ సైట్ ద్వారా సేవలు పొందగోరేవారు పేపాల్ ద్వారా చెల్లింపులు జరుపవచ్చని - ఆఫ్ లైన్ చెల్లింపు సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అన్ని ప్రీ-పెయిడ్ సర్వీసులేనని - ఒక్కో సర్వీసుకు కనీస చార్జీ 10 డాలర్లని ఆయన తెలిపారు.