అమెరికా వంటి దేశాల్లో బందువులకు, చుట్టాలకు, వారసులకు ప్రభుత్వ పదవులు కట్టబెట్టడం వంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి అంటారు. అయితే తాజాగా ఆ అరుదైన చర్యకు తొలి అడుగేశారు. అవును... త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు అయిన 35 ఏళ్ల జారెద్ కుష్నర్ ను శ్వేతసౌధం సీనియర్ సలహాదారుడిగా నియమించారు. దీంతో వాణిజ్యం, మిడిల్ ఈస్ట్ వ్యవహారాలు - దేశీయ - విదేశీ అంశాల్లో కుష్నర్ పాత్ర కీలకం కానుంది.
అయితే అమెరికాలోని ప్రభుత్వ పదవుల్లో ఆశ్రిత పక్షపాతాన్ని నిరోధిస్తూ 1967లో చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వ అధికారులను ఎంపిక చేసుకునే ఆచారంపై నిషేధం ఉంది. అయితే ఈ చట్టం కష్నర్ కు వర్తించదని చెబుతున్నారు అతని తరుపు న్యాయవాది. ఈ లెక్కన చట్టబద్దమైన ఆమోదం లభించిన వెంటనే కుష్నర్ వైట్ హౌస్ సలహాదారు పదవి చేపడతారు.
ఈ విషయాలపై స్పందించిన ట్రంప్... కుష్నర్ తనకు లభించిన అద్భుతమైన ఆస్తి అని - ఎన్నికల ప్రచారంలో తనకు నమ్మకమైన సలహాదారుడిగా ఇతడు నిలిచాడని అన్నారు. కాగా, కష్నర్ ఇప్పటికే ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ సీఈవో - న్యూయార్క్ అబ్జర్వర్ పదవులకు రాజీనామా చేశారు. మరోపక్క ట్రంప్ కూతురు - కుష్నర్ భార్య అయిన ఇవాంకా కూడా ట్రంప్ ఆర్గనైజేషన్ నుంచి, సొంత ఫ్యాషన్ బ్రాండ్ బిజినెస్ నుంచి తప్పుకొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/