కూతురు టూర్‌ ను క‌న్ఫ‌ర్మ్ చేసిన ట్రంప్‌

Update: 2017-08-12 04:38 GMT
ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌.. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ రానున్న విష‌యం తెలిసిందే.  న‌వంబ‌రు 28న జ‌రిగే అంత‌ర్జాతీయ పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సుకు త‌న కుమార్తె ఇవాంకా హాజ‌రుకానున్న విష‌యం ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె రాక‌ను ఇప్ప‌టికే ప్ర‌ధాని మోడీ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించారు.

స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే అమెరికా ప్ర‌తినిధుల బృందానికి ఇవాంకా నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఇవాంకా స‌ద‌స్సుకు హాజ‌ర‌వుతున్న విష‌యాన్ని ట్రంప్ సైతం క‌న్ఫ‌ర్మ్ చేశారు. అమెరికా ప్ర‌తినిధుల బృందానికి నేతృత్వం వ‌హించ‌టం.. ప్ర‌ధాని మోడీని క‌లుసుకోనుండ‌టం త‌న‌కు ద‌క్కిన గొప్ప గౌర‌వంగా భావిస్తున్న‌ట్లుగా ఇవాంకా పేర్కొన్నారు.

తండ్రి ట్రంప్‌ కు స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇవాంకా చిన్నారులకు సంబంధించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నారు. మ‌రి.. 35 ఏళ్ల ఇవాంకా హాజ‌రు కానున్న ఈ  స‌ద‌స్సు జాతీయ‌స్థాయిలో విప‌రీత‌మైన ఫోక‌స్ ప‌డ‌టం ఖాయ‌మంటున్నారు. ఇది.. బ్రాండ్ హైద‌రాబాద్ కు స‌రికొత్త ఇమేజ్ తెచ్చే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ఎంద‌రో ప్ర‌ముఖుల మ‌న‌సును దోచిన భాగ్య‌న‌గ‌రి.. ఇవాంకా మ‌దిని మ‌రెంత‌లా దోచుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News