కరోనా వైరస్ తో అమెరికా అతలాకుతలం అవుతోంది. ఎన్నడూ లేనంత తీవ్ర ప్రాణ నష్టాన్ని చవిచూస్తోంది. లాక్డౌన్ తో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. దాదాపు 22 మిలియన్ల మందికి ఉపాధి దూరమైందని సమాచారం. దీంతో అధ్యక్షుడు ట్రంప్ నడుం బిగించారు. కరోనా ముగిశాక అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఇమిగ్రేషన్ చట్టాలను సవరించారు. వలసలపై నిషేధం విధించారు. ఇకపై రెండు నెలల పాటు ఇతర దేశాల ప్రజలు అమెరికాకు వచ్చి స్థిరపడడంపై తక్షణం నిషేధం అమలు చేశారు.
కరోనా వైరస్ తో అమెరికాకు భారీ ఆర్థిక సంక్షోభం కళ్లముందట ఉంది. పైగా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో ఉన్నాయి. దీంతో అమెరికన్ల ప్రయోజనాలకే ట్రంప్ పెద్ద పీట వేస్తూ వలసలను నిషేధించారు. ఇది పూర్తి గా రాజకీయ పరమైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. అమెరికన్ల ఓట్లను కొల్లగొట్టేందుకు ట్రంప్ ఈ చర్య తీసుకున్నాడని నిపుణులు అంచనావేస్తున్నారు. పైగా ట్రంప్ అమెరికన్లకే ఫస్ట్ ఉద్యోగాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇలా నిలబెట్టుకుంటున్నారు. ఎన్నికల వరకు ఈ నిషేధం అమల్లో ఉండవచ్చంటున్నారు.
ఇక ఈ వలసల నిషేధంతో భారత్ పై పడే ప్రమాదం ఎంతనేది నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ వలసలపై కఠిన నిబంధనలు.. వీసాల జారీలో కొర్రీలు వేస్తుండడంతో భారత్ నుంచి చాలా వలసలు అమెరికాకు తగ్గాయి. గత ఏడాది ఏకంగా 8శాతం వరకు వలసలు భారత్ నుంచి అమెరికాకు తగ్గాయని గణంకాలు వెల్లడిస్తున్నాయి. భార్య వీసాలను - డిపెండెంట్ వీసాలను ట్రంప్ టైట్ చేశారు. దీంతో భారతీయులు కుటుంబాలను తీసుకెళ్లలేక ఏకంగా అమెరికానే వదిలి ఇండియాకు వస్తున్నారు. దీంతో గ్రీన్ కార్డ్ కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గింది.
ఇక ట్రంప్ కాలంలో అమెరికా వెళ్లడానికి పెట్టుకునే దరఖాస్తులను పెద్ద సంఖ్యలో రిజెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కలిపి అమెరికా ఫ్లైట్ ఎక్కడం ఇప్పుడు దుర్భరంగా మారింది.
ఇక హెచ్1బీ వీసాల దరఖాస్తులు.. కొత్తగా చదువు కోసం వెళ్లే విద్యార్థులకు ట్రంప్ నిర్ణయం గుదిబండగా ఉంది.అక్కడ సెటిల్ కాని పరిస్థితిని ట్రంప్ కల్పించారు. దీంతో అమెరికా ఆశలను చాలా మంది కొత్తగా వెళ్లే నిపుణులు సైతం వదులుకునే పరిస్థితి నెలకొంది.
2019లో అమెరికా 10 లక్షల మంది వలసదారులకు అమెరికాలో ఉండేందుకు అనుమతిచ్చింది. అందులో భారతీయుల సంఖ్య కేవలం 12శాతం మించి ఉండదని నిపుణులు చెబుతున్నారు. హైఎండ్ టెక్నాలజీ రంగంలోనే భారతీయులు వస్తున్నారు. మిగతా రంగాలలోకి రావడం లేదు. దీంతో ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వల్ల ఆ టెక్నాలజీ రంగంలోనూ భారతీయులు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.
అంతిమంగా ట్రంప్ ఇమిగ్రేషన్ విధానం వల్ల అమెరికా ప్రజల సంక్షేమమే ప్రథమ ఎజెండా కనిపిస్తోంది. దానిని దృష్టిలో పెట్టుకొనే ట్రంప్ ఈ వలసలపై కొర్రీలు పెడుతున్నారు. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడడం కోసం విదేశీ వలసలను చాకచక్యంగా కొర్రీలు పెడుతున్నారు. దీంతో భవిష్యత్ లోనూ భారత్ నుంచి అమెరికాకు వలసలు తగ్గుతాయి. భారత నిపుణులు భారత్ లోనే ఉండిపోతారు. ఇది అమెరికాకు నష్టం కాగా.. భారత్ కు లాభం. అయితే భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటేనే లాభం కలుగుతుంది. ఇక భారతీయుల అమెరికా ఆశలకు కూడా ట్రంప్ నిర్ణయంతో తెరపడనుంది.