అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 20న ప్రమాణ స్వీకారానికి రాజధాని వాషింగ్టన్ ముస్తాబవుతోంది. నేషనల్ మాల్ లో జరిగే ఈ కార్యక్రమానికి 1600 అతిథులతోపాటు 8లక్షల మంది హాజరవుతారని అంచనా. ఇందుకు ప్రత్యేకంగా 10వేల చదరుపు అడుగుల వేదికను సిద్ధం చేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి డబ్ల్యూ బుష్ - బిల్ క్లింటన్ - జిమ్మీకార్టర్ హాజరుకానున్నారు.
కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అమెరికాస్ గాట్ టాలెంట్ షో విజేత జాకీ ఎవాంచో ఆలపించనున్నారు. తన ప్రమాణ కార్యక్రమానికి అమెరికా సెలబ్రిటీలను పెద్ద సంఖ్యలో రప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ కార్యక్రమంలో చార్లెస్ బ్రాట్‌మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం సంప్రదాయం. ట్రంప్ మాత్రం ఆ బాధ్యతలను అమెరికా నేషనల్ బేస్ బాస్ టీమ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన స్టీవ్ రేకు అప్పగించారు.
మరోవైపు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి నిరసనల సెగ మొదలైంది. ప్రముఖ గాయకులు చార్లొట్టె చర్చ్ - సర్ ఎల్టాన్ జాన్ లు ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. పౌర హక్కుల కార్యకర్త - డెమోక్రటిక్ ప్రతినిధి జాన్ లూయిస్ తోపాటు 16మంది డెమోక్రటిక్ చట్టప్రతినిధులు కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ట్రంప్ ప్రమాణ కార్యక్రమం రోజు నిరసన తెలిపేందుకు వివిధ అంశాల పేరిట కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు ట్రంప్ ప్రమాణస్వీకార వేడుకకు కనీవినీ ఎరుగనిరీతిలో భద్రతాఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రోపాలిటన్ పోలీస్ - నేషనల్ పార్క్ సర్వీస్ - నేషనల్ గార్డ్ - సీక్రెట్ సర్వీస్ - ఎఫ్ బీఐ సహా 36 విభాగాలు బందోబస్తు ఏర్పాట్లలో పాల్గొంటున్నాయి. ఇందుకు సుమారుగా రూ.వెయ్యికోట్ల ఖర్చు అవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/