కరోనా వైరస్ ని పెంచినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా సార్?

Update: 2020-04-05 07:19 GMT
భారత్ సహా ప్రపంచంలోని సగం దేశాలు కరోనాకు భయపడి లాక్ డౌన్ విధించాయి. జనాల ప్రాణాల కంటే ఈ డబ్బు - ఆర్థిక మాంద్యం లెక్కకాదని ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాయి. తద్వారా అందరినీ ఇళ్లకే పరిమితం చేసి ప్రజారోగ్యమే తమ ప్రథమ కర్తవ్యం అని చాటాయి..

కానీ మన అగ్రరాజ్యపు అధినేత - తిక్క ట్రంప్ మాత్రం ప్రపంచపు పెద్దన్న హోదా పోతుందని.. లాక్ డౌన్ తో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని భావించి లాక్ డౌన్ విధించకుండా ప్రజలను బలిపెడుతున్నాడు. అమెరికా లాక్ డౌన్ విధిస్తే చైనా తమ అగ్రస్తానాన్ని ఆక్రమిస్తుందని ట్రంప్ భయం.. అందుకే ప్రజలు పిట్టల్లా రాలుతున్నా లాక్ డౌన్ విధించకుండా దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని అమెరికన్లు మండిపడుతున్నారు.

ప్రపంచం అంతా లాక్ డౌన్ చేస్తే కేవలం ట్రంప్ మాత్రం ఆ పని చేయలేకపోయాడు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని.. డబ్బు కోసం లాక్ డౌన్ చేయకుండా ఉంచిన ట్రంప్ ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. 2.5లక్షల మందికి పైగా కరోనా సోకి.. రోజులకు 1000 మందికి పైగా మరణాలతో కరోనా మరణ మృదంగం అమెరికాలో మోగుతోంది. లాక్ డౌన్ చేయకుండా అమెరికన్ల భావి జీవితాన్నే  నాశనం చేస్తున్న ట్రంప్ తీరుపై ఆ దేశస్థులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. అమెరికాకు ఇంత నష్టం చేస్తున్న ట్రంప్ తాను మాత్రం సుద్దపూస అన్నట్టే మాట్లాడడమే పెద్ద చోద్యంగా ఉంది.

తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా సహా ప్రపంచానికి తాను చేస్తున్న సేవలకు గాను నిజాయితీగా ఇస్తే తనకు నోబెల్ బహుమతి వస్తుందని’ హాట్ కామెంట్ చేశారు. కానీ నోబెల్ బహుమతి కోసం ఎంపిక చేసే కమిటీ ఆ పనిచేయడం లేదని విమర్శించాడు. గతంలో ఒబామాకు నోబెల్ రావడంపై ఆయన కూడా ఆశ్చర్యపోయాడని.. ఆయనకు అసలు నోబెల్ ఎందుకిచ్చారో తెలియదని ఎద్దేవా చేశాడు.

ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కరోనాను పసిగట్టడంలో.. నివారించడంలో.. అమెరికాలో చర్యలు చేపట్టడంలో.. లాక్ డౌన్ విధించడంలో ట్రంప్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. కనీసం లాక్ డౌన్ విధించినా కంట్రోల్ లో ఉండేది. ఆ పనిచేయని ట్రంప్ వల్ల ఇప్పుడు అమెరికన్లు పిట్టల్లా రాలుతున్నారు. ఇదంతా ట్రంప్ తప్పు అంటున్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ట్రంప్ కు ఎలా నోబెల్ ఇవ్వాలని జనాలంతా కడిగిపారేస్తున్నారు. అమెరికన్లు అంతా తిడుతున్న ట్రంప్ కు ఇంకా తనకే నోబెల్ బహుమతి రావాలనడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.   సొంత లాభం కోసం ప్రజలను బలిపెట్టిన ఇలాంటి అధ్యక్షుడిని ఎక్కడా చూడలేదని.. ఇతడికి నోబెల్ కాదు.. కదా.. గల్లీ అవార్డుకు కూడా ట్రంప్ అర్హుడు కాదంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.


Tags:    

Similar News