ట్రబుల్ మాటను బ్యాన్ కు చేర్చిన ట్రంప్

Update: 2017-02-04 16:24 GMT
మూర్తీభవించిన మొండితనంతో ఉండే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తాజాగా తాను తీసుకున్న నిర్ణయంపై ఎంతమాత్రం ఫీల్ కావటం లేదు. ఏడు ముస్లిం దేశాలపై విధించిన బ్యాన్ పై ప్రపంచవ్యాప్తంగా పలువురు తప్పు పడుతున్న.. స్వదేశంలో పెద్ద ఎత్తున నిరసనలు..ఆందోళనలు వ్యక్తమవుతున్నా ట్రంప్ వాటిని అస్సలు పట్టించుకోని వైనం తాజాగా ఆయన చేసిన ట్వీట్ తో చెప్పేశారు.

ఏడు దేశాలపై విధించిన బ్యాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శల్ని తాను లైట్ తీసుకున్న విషయాన్ని తన తాజా ట్వీట్ తో తేల్చేసిన ట్రంప్.. ‘‘ఒక దేశంలోకి ఎవరు రావాలో.. ఎవరు రావొద్దో చెప్పలేనప్పుడు.. అందులోనూ అది భద్రతా కారణాలకు సంబంధించి అయితే అది చాలా పెద్ద ట్రబుల్ అవుతుంది’’ అని ట్వీట్ చేశారు. మొత్తానికి ట్రబుల్ మాటను తన బ్యాన్ కు చేర్చి.. తన వాదనను సమర్థించుకున్న తీరు చూస్తే.. ఎవరు ఎన్ని అన్నా.. తాను ఏమనుకుంటానో దాన్నే చేసుకుంటూ పోతానన్న విషయాన్ని ట్రంప్ తేల్చి చెప్పేసినట్లుగా చెప్పొచ్చు.

మరోవైపు.. హెచ్ 1 బీ వీసాల మీద వచ్చే వారి కనీస వేతనాన్ని 60వేల డాలర్ల నుంచి 1.3లక్షల డాలర్లకు పెంచేసేలా బిల్లును దిగువ సభకు తీసుకురావటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లు మరో రెండు బిల్లులను తెర మీదకు వచ్చి.. ఐటీ వర్గాలకు కొత్త టెన్షన్ ను తీసుకొస్తున్నాయి. 2007లో వర్క్ వీసాల్లో సంస్కరణల కోసం తీసుకొచ్చిన ఒక బిల్లును దుమ్ము దులుపి తాజాగా తెర మీదకు తీసుకొచ్చారు. తాజా బిల్లుతో అత్యంత నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే అమెరికా వేదిక అవుతుందన్న మాటను చెబుతున్నారు.

ఇది సరిపోదన్నట్లుగా ‘ఒప్పంద ఉద్యోగాలకు స్వస్తి పలికే చట్టాన్ని’ ముగ్గు డెమొక్రటిక్ పార్టీకి చెందిన ముగ్గురు సెనేటర్లు (జో డొనెల్లీ.. షరోడ్ బ్రౌన్.. గిల్లీ బ్రాండ్) తీసుకొచ్చారు. ఒప్పంద ఉద్యోగాలిచ్చేకంపెనీలకు రాయితీలు ఇవ్వొద్దని.. అమెరికా ప్రభుత్వంతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అంగీకరించొద్దని సదరు బిల్లు కోరుతోంది. ఊహించని రీతిలో తెర మీదకు వచ్చిన ఈ రెండు బిల్లులు భారత ఐటీ వర్గాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News