ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. జనాభాలో రెండో స్థానం.. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న గొప్ప దేశం.. మార్కెటింగ్ కు ఎన్నో అవకాశాలు ఉన్న ధరణి భారతదేశం. అందుకే ఈ దేశంలో పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా దంపతులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే ఆతృత పడుతున్నారు. రెండు వారాల ముందు నుంచే భారత్ పర్యటన పై ట్రంప్ దంపతులు సోషల్ మీడియా లో స్పందిస్తూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇండియాకు వెళ్లడం గొప్ప అని ఆయన అంటున్నాడు. దీంతో ఆయన భారత్ పై ఎంత ఆసక్తి పెంచుకున్నారో అర్థమవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తన భారత పర్యటన గురించి మరోసారి ట్వీట్ చేశారు. మరో రెండు వారాల్లో ఇండియాకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ పర్యటన గురించి ఎంతో ఆసక్తి గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఫేస్‌బుక్ లో నెంబర్ వన్ స్థానం లో ఉన్నట్లు దాని ఓనర్ మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన విషయాన్ని ట్రంప్ తన ట్వీట్‌లో గుర్తు చేశారు. తనకు ఆ స్థానం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఫేస్ బుక్ లో రెండో స్థానం లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారనే విషయాన్ని కూడా ఆయన తన ట్వీట్ లో ప్రస్తావించారు. వాస్తవానికి తాను కూడా ఇండియా టూర్‌కు వెళ్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ఇండియా లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీతో పాటు అహ్మదాబాద్‌లో ఆయన పర్యటిస్తారు. అహ్మదాబాద్లో కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియం లో జరిగే కార్యక్రమం లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో కలిసి ట్రంప్ దంపతులు పాల్గొననున్నారు. వీరి పర్యటన దేశం లోనే కాక ప్రపంచ వ్యాప్తం గా ఆసక్తి గా గమనిస్తున్నారు.