భారతీయ మగవారికి ట్రంప్ వార్నింగ్..జాగ్రత్తగా లేకపోతే అంతే..?

Update: 2020-02-24 11:41 GMT
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ..నమస్తే ట్రంప్ సభలో అయన చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నమస్తే ఇండియా అంటూ ప్రసంగం మొదలుపెట్టిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇండియాలో మోడీ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది అని , భారత్ మానవత్వానికి ప్రతీక అన్నారు. భారత్ కి ఉన్న శక్తి సామర్ధ్యాలు వెలకట్టలేనివి అన్నారు ఆయన. భారత్ అభివృద్దిని చూసి అమెరికా గర్విస్తుంది అన్నారు. ఒక చాయ్ వాలా ని ప్రధానిని చేసిన గొప్ప ఘనత ఇండియన్స్ కి సొంతం అని తెలిపారు.

అలాగే ఇంకా అయన మాట్లాడుతూ .. ఉగ్రవాద౦ విషయంలో భారత్ - అమెరికా సిద్దాంతం ఒకటే అన్నారు. భారత్ ఎన్నో రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తుంది అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాద౦ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తామన్నారు. భారత పర్యటన కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. భారత్ అమెరికా సహజంగానే స్నేహితులు అని , రెండు దేశాల మధ్య డిజిటల్ బంధం బలపడుతుంది అని తెలిపారు. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘దేశ అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. పారిశ్రామికంగా ఉన్నతంగా ఎదుగుతున్నారు. గొప్ప ప్రగతిని సాధిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. పురుషులూ జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. లగే  ఇరుదేశాల మధ్య వాణిజ్యసంబంధాలను గురించి మాట్లాడిన ట్రంప్… దక్షిణాసియాలో భారత్ కీలకపాత్ర పోషిస్తుందని అని అన్నారు. రెండు దేశాల మధ్య 40శాతం వాణిజ్యం పెరిగిందని.. ఎగుమతులు, దిగుమతలు వృద్ధి పథంలో ఉన్నాయన్నారు.
Tags:    

Similar News