సినిమాల్లో హిట్ అయిన నటులు.. రాజకీయాల్లో హిట్ అవుతారన్న గ్యారెంటీ లేదు.. టాలీవుడ్ ను కొన్నేళ్లు ఏలిన చిరంజీవియే రాజకీయాల్లో రాణించలేక తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు పవన్ పోరాడుతున్నారు. కానీ సినిమా తారలకు మాత్రం రాజకీయాలపై ఆశ చావడం లేదు.
ఈ దఫా సార్వత్రిక ఎన్నికల వేళ చాలా మంది బాలీవుడ్ తారలు వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీచేశారు. సన్నిడియోల్, ఉర్మిలా మంటోడ్కర్, రేసుగుర్రం విలన్ రవికిషన్ సహా చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఈ కోవలోనే రంగీలా హీరోయిన్ ఉర్మిల కూడా ముంబై ఉత్తరం నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసింది. రాంగోపాల్ వర్మ తీసిన బాలీవుడ్ ‘రంగీలా’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ నటించింది. ప్రస్తుతం ఆమె కెరీర్ ముగిసిపోయింది. అందుకే రాజకీయాల బాటపట్టి కాంగ్రెస్ లో చేరి పోటీచేసింది.
అయితే తాజా ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఉర్మిళను తీవ్ర నిరాశకు గురిచేశాయని సమాచారం. ఈ ఎన్నికల వేళ ఉర్మిళ ముంబై ఉత్తరంలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఈసారి తనదే గెలుపు అని హాట్ కామెంట్స్ చేసింది. ప్రజలతో మమేకం అవుతూ ట్రెండింగ్ లో నిలిచింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ,బలమైన గోపాల్ శెట్టిని ఓడిస్తానని శపథం చేసి వినూత్న ప్రచారంతో వార్తల్లో నిలిచింది.అయితే ఆమెకు గెలుపు అవకాశాలు లేవని తాజా ఎగ్జిట్ పోల్స్ లో తేలడంతో ఆమె నిరాశలో మునిగిపోయినట్టు సమాచారం. ఇక్కడ బీజేపీ ఎంపీయే గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. మొదటిసారి ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ప్రయత్నం తొలి ప్రయత్నంలోనే విఫలం కావడం కృంగదీసిందట..
అయితే తాను మళ్లీ సినిమాల్లోకి వెళ్లను అని ఉర్మిళ ప్రచారంలో స్పష్టంచేశారు. ఇప్పుడు ఓడిపోతుందన్న అంచనాల నేపథ్యంలో ఆమె మళ్లీ సినిమాల బాట పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓడినా.. గెలిచినా తాను ప్రజల కోసం పోరాడుతూ రాజకీయాల్లోనే ఉంటానని.. సినిమాల్లోకి వెళ్లనని ఆమె చెప్పినట్టు సమాచారం. తనకు అదృష్టం లేదని అందుకే ఓడిపోతున్నానని.. మరోసారి ప్రయత్నిస్తానంటూ ఉర్మిళ చెప్పినట్టు తెలిసింది.