రంగాలు ఎన్ని ఉన్నా..కొన్ని రంగాలకు ఉండే గ్లామర్.. గ్రామరు కాస్త వేరుగా ఉంటాయి. అత్యంత గౌరవనీయ వృత్తిగా ఉపాధ్యాయ వృత్తిని అభివర్ణిస్తారు. పాడు సినిమాలతో ఉపాధ్యాయులంటే బఫూన్లు.. జోకర్లు.. కామెడీ క్యారెక్టర్లుగా చూపిస్తున్నారు. గతంలో చాలామందికి టీచర్లే స్ఫూర్తివంతులుగా ఉండేవారు. తాము ఏస్థాయికి చేరుకున్నా..ఆ క్రెడిట్ టీచర్లకు ఇచ్చేవారు.
ఇప్పుడు అన్ని రంగాల్లో మాదిరి ఉపాధ్యాయ రంగం కూడా విలువ.. గౌరవ మర్యాదల్ని కోల్పోయింది. ఎక్కడో కొందరు తప్పించి.. ఉపాధ్యాయ వృత్తిని కాసుల్ని పోగేసే మాదిరే భావిస్తున్నారు తప్పించి.. విద్యార్థుల జీవితాల్నిబాగు చేయాలన్న తపన తగ్గుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించి వింటే నోట మాట రాదంతే.
ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చేలా ఈ ఉదంతం చోటు చేసుకుంది. కర్ణాటకలోని తమకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో పాఠాలు బోధించే టీచరమ్మ పూటుగా తాగేసి వచ్చి.. పిల్లలకు పాఠాలు చెప్పిన వైనం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం వెలుగు చూసిన వెంటనే ఆమెను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మద్యం సేవించి స్కూలుకు రావటమనే ఆలోచనకే సిగ్గు పడే దానికి భిన్నంగా తాగేసి స్కూలుకు వచ్చిన గంగలక్ష్మమ్మ పాఠాలు చెప్పే వైనం గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
గడిచిన ఐదేళ్లుగా ఆమె మద్యానికి బానిస అయ్యారని.. నిత్యం తాగేసే స్కూలుకు వస్తారని చెబుతున్నారు. ఫుల్ గా తాగేసి స్కూలుకు వచ్చే ఆమె.. కారణం లేకుండానే పిల్లల్ని కొట్టటం.. అరవటం.. తోటి ఉపాధ్యాయులతో గొడవలు పెట్టుకోవటం లాంటి పనులను చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు.. టీచరమ్మకు ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేదు.
చివరకు ఆమెపై చర్య తీసుకోవాల్సి వస్తుందని పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కు తాళాలు వేసి.. లేడీటీచర్ తీరుకు వ్యతిరేకంగా నిరసన దిగారు.
ఈ నేపథ్యంలో విద్యా శాఖాధికారులు వివరాలు తెలుసుకునేందుకు స్కూల్ కు వచ్చారు. స్కూల్ లోపల టీచరమ్మ టేబుల్ డ్రాను చూసేందుకు ప్రయత్నించగా.. ఆమె ఒప్పుకోలేదు. దీంతో.. గ్రామస్థులు టేబుల్ డ్రాకు ఉన్న తాళాలు విరగొట్టి చూడగా.. ఒక మద్యం సీసా.. మరో ఖాళీ సీసా కనిపించాయి. దీంతో..తన గదిలోకి వెళ్లి తాళం వేసుకున్న ఆమె ఆత్మహత్య చేసుకుంటానని హడావుడి చేశారు. దీంతో పోలీసుల్ని పిలిపించిన అధికారులు.. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవటంతో పాటు.. టీచరమ్మనుసస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదంతం షాకింగ్ మారటమే కాదు.. జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.