నయిం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నరహంతకుడైన నయిం ఎన్ కౌంటర్ జరిగి ఇన్ని రోజుల తర్వాత కూడా అతడికి సంబంధించి అంశాలు ఇప్పుడు సంచలనానికి దారి తీస్తున్నాయి. నయింతో పలువురు రాజకీయ నేతలు.. పోలీసు ఉన్నతాధికారులతో సహా కొందరు మీడియా వారికి కూడా సంబంధాలున్నట్లుగా వచ్చిన ఆరోపణలు తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడిన టీఆర్ ఎస్ నేత దుబ్బాక నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నయింతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పిన ఆయన.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు. తనకున్న గన్ లైసెన్స్ కు నయిం కేసుకు సంబంధం లేదని చెప్పిన ఆయన.. కోనాపురి రాములు హత్యలో తన పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ హత్యలో తన పాత్ర ఉండి ఉంటే.. ఎప్ ఐఆర్ తన పేరు ఉండేది కదా? అని ప్రశ్నిస్తున్నారు. రాములు తనకు ప్రాణస్నేహితుడిగా అభివర్ణించిన దుబ్బాక.. తనను చంపేందుకు కోమటిరెడ్డి కుట్ర పన్నినట్లుగా చెప్పారు.
గత ఎన్నికల్లో కోమటిరెడ్డికి నయిం సహకరించారని.. అతనితో కోమటిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. తనకు ప్రాణ హాని ఉన్నందుకే గన్ లైసెన్స్ తీసుకున్నట్లుగా చెప్పారు. 2009లో నయింకు కోమటిరెడ్డి బుల్లెట్ ఫ్రూప్ కారు కొనిచ్చినట్లుగా ఆరోపించిన దుబ్బాక.. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నట్లుగా విమర్శించారు. నయిం కేసుకు సంబంధించి విచారణకు తాను సిద్దంగా ఉన్నట్లు కోమటిరెడ్డి ప్రకటించినప్పటికీ.. దుబ్బాక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/