కేసీఆర్‌..ఖాకీ బాసుల ఒత్తిళ్లు పెరిగిపోయాయిగా!

Update: 2017-03-03 10:29 GMT
తెలంగాణ పోలీసు శాఖ‌లో అధికారుల ఒత్తిళ్లు నానాటికీ మితిమీరిపోతున్న‌ట్లుగా ఉంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు - ముగ్గురు కింది స్థాయి పోలీసు అధికారులు బాసుల ఒత్తిళ్లు త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఆత్మ‌హ‌త్య‌లు కూడా ఒకే సిరీస్‌లో చోటుచేసుకున్న వైనం క‌ల‌క‌లం రేపింది. తాజాగా కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట‌లోని దుబ్బాక‌లో ఇదే త‌ర‌హా ఘ‌ట‌న చోటుచేసుకుంది. మొన్న‌టిదాకా దుబ్బాక‌లో ఎస్సైగా విధులు నిర్వ‌హించిన చిట్టిబాబును ఉన్న‌తాధికారులు ఇటీవ‌లే సిద్దిపేట‌కు బ‌దిలీ చేశారు. అయితే సిద్దిపేట‌కు వెళ్లేందుకు చిట్టిబాబు విముఖ‌త వ్య‌క్తం చేసినా... ఉన్న‌తాధికారులు ఆయ‌న‌ను బ‌ల‌వంతంగా అక్క‌డికి పంపార‌ట‌. బాసుల ఒత్తిడితో 10 రోజుల క్రితం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో సిద్దిపేట‌కు వెళ్లిన చిట్టిబాటు... తీవ్ర‌మైన ఒత్తిడిలోనే విధులు నిర్వ‌ర్తిస్తున్నార‌ట‌. అంతేకాకుండా త‌న కుటుంబాన్ని ఇంకా దుబ్బాక‌లోనే ఉంచి ఆయ‌న మాత్రం సిద్దిపేట‌లో ప‌నిచేస్తున్నార‌ట‌.

ఈ క్ర‌మంలో కాసేప‌టి క్రితం దుబ్బాక‌లోని చిట్టిబాబు త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్ తో త‌న భార్య లేఖ‌ను కాల్చేసి... ఆ త‌ర్వాత త‌న‌ను తాను కాల్చేసుకున్నాడు. ఈ ఘట‌న‌లో లేఖ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోగా... చిట్టిబాబు మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. వెనువెంట‌నే స్పందించిన దుబ్బాక పోలీసులు చిట్టిబాబును హుటాహుటిన సిద్దిపేట ఆసుప‌త్రికి త‌ర‌లించే య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఉన్న‌తాధికారుల వేధింపుల‌లు త‌ట్టుకోలేక‌నే చిట్టిబాబు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఆయ‌న స‌హ‌చ‌ర ఉద్యోగులు చెబుతున్నారు. సీఎం సొంత జిల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న అంద‌రినీ పెను క‌ల‌వ‌రానికి గురి చేసిందనే చెప్పాలి. మ‌రి ఇప్ప‌టికైనా... పోలీసు బాసుల క‌రకు త‌త్వంపై కేసీఆర్ దృష్టి సారిస్తారో, లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News