ఈడీ దాడి... బ్యాంకు అధికారులకు చెమట్లు

Update: 2016-12-07 10:01 GMT
ఎన్నడూ లేనట్లుగా దేశవ్యాప్తంగా పలు బ్యాంకులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేస్తోంది. మొత్తం  54 బ్యాంకులపై ఇప్పటికే  దాడులు చేయగా మరికొన్ని బ్యాంకులు కూడా ఈడీ దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకు అధికారులంతా చెమటతో తడిసి ముద్దవుతున్నారు.
    
పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాత బ్యాంకుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ లేనట్లుగా బ్యాంకు అధికారులు, సిబ్బంది పండగ చేసుకుంటున్నారు. మొదట పాత నోట్ల మార్పిడి చేయడంతో మొదలు పెట్టి ఇప్పుడు పరిమితి లేకుండా పెద్దోళ్లకు డబ్బులు సర్దుబాటు చేయడం వరకు వ్యవహారాలు చక్కబెడుతూ కమీషన్ల రూపంలో రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు కోట్లకు కోట్లు కొల్లగొట్టేశారని ఆరోపణలుంటున్నాయి.
    
బ్యాంకులకు వస్తున్నప్పటికీ, సామాన్యులకు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. దీనికంతంటికీ బ్యాంకు అధికారులే కారణమని ఈడీ గుర్తించి ఉక్కుపాదం మోపడానికి రెడీ అయింది.  దేశ వ్యాప్తంగా బ్యాంకులపై దాడి చేసి, తనిఖీలు నిర్వహిస్తోంది. డబ్బు రవాణా - మనీ లాండరింగ్ అంశాలపై కూడా ఆరా తీస్తోంది. ఈడీ దాడులు చేసిన బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంకులన్నీ ఉన్నాయి. తాజా పరిణామాలతో అధికారులు షాక్ తిన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News