సీబీఐకి చీఫ్ గా వ్యవహరించిన ప్రముఖుడి కొడుకు ఇంట్లో సోదాలు ఊహించగలమా? కానీ.. తాజాగా అది వాస్తవమైంది. తన తండ్రికి ఉన్న పేరు ప్రఖ్యాతులతో బ్యాంకుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున రుణాల్ని తీసుకొని.. తిరిగి చెల్లించని వైనంపై అధికారులు దృష్టి సారించారు.
ఇంతకూ.. ఆ సీబీఐ మాజీ చీఫ్ ఎవరంటే? తెలుగు ప్రాంతానికి చెందిన విజయరామారావు. వ్యక్తిగతంగా ఎప్పుడూ.. ఎవరి చేత మాట అనిపించుకోని విజయరామారావు.. తాజాగా తన కొడుకు తీరుతో కొత్త తిప్పలు ఎదుర్కొంటున్నారు. విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ ఇంట్లోనూ.. ఆఫీసులోనూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విభాగం సోదాల్ని నిర్వహించింది.
కర్ణాటకకు చెందిన ప్రముఖ బ్యాంకు నుంచి రూ.315 కోట్ల రుణాన్ని తీసుకొని తిరిగి చెల్లించలేదు. ఈ క్రమంలో సదరు బ్యాంకు అధికారులు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ.. తాజాగా శ్రీనివాస్ ఇంట్లోనూ.. కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన కేసు గతంలోనే నమోదైంది. తండ్రి తీరుకు భిన్నంగా ఉండే శ్రీనివాస్ తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయరామారావు ప్రతిష్ట కొడుకు కారణంగా దెబ్బ తినటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.