ఏపీలో ఏం జరుగుతోందో సంబంధిత శాఖా మంత్రులకు కూడా తెలియదా అన్న సందేహాలు వచ్చేస్తున్నాయి. హోం మంత్రి, వైద్య మంత్రి ఆ విధంగానే తమ శాఖల విషయంలో తడబాటు పడుతున్నారు, తరచుగా అభాసు పాలు అవుతున్నారు. ఆయా మంత్రిత్వ శాఖ పనితీరు పట్ల విపక్షాలు ఇప్పటికే గట్టిగా నోరు చేసుకుంటున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే బొత్స సత్యనారాయణ జగన్ క్యాబినేట్ లో సీనియర్ మోస్ట్ మంత్రి. ఆయన పదమూడేళ్ళ పాటు మంత్రిగా వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేశారు.
ఇంతటి అనుభవశాలిని తెచ్చి విద్యా శాఖ అప్పగిస్తే పదవ తరగతి పరీక్షలు తొలి రోజు నుంచీ కూడా లీకులే లీకులు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అయితే ఎన్ని లీకులు జరిగినా విపక్షాలు ఎంతగా అరచి గీ పెట్టినా మంత్రి గారు మాత్రం అబ్బే అక్కడ అసలు ఏమీ జరగలేదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. మేము కట్టుదిట్టంగానే టెన్త్ పరీక్షలు నిర్వహించామని కూడా ఆయన అంటూ వచ్చారు.
కానీ ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి సభలో మాట్లాడుతూ పదవతరగతి పరీక్షా పత్రాలు లీక్ నిజమే అని అంగీకరించారు. దానికి ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే నారాయణ, చైతన్య విద్యా సంస్థలకు చెందిన యాజమాన్యాలే పేపర్లను లీక్ చేశాయని. అంటే ఎవరు చేసినా తప్పు అయితే జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం లీకేజ్ అయింది అని ఒప్పుకుంది. మరి ఆ లీకేజిని అరికట్టలేని బాధ్యతా రాహిత్యం కచ్చితంగా ప్రభుత్వ పెద్దలదే కదా.
జరగక జరగక రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత టెన్త్ పరీక్షలు జరిగితే వాటిని సక్రమంగా ప్రభుత్వం నిర్వహించలేకపోవడం దారుణమే అంటున్నారు. విద్యార్ధులు తమ బంగారు భవిష్యత్తుని దిద్దుకునేందుకు కష్టపడి పదవతరగతి పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. తీరా మొదటి రోజు నుంచి లీకులే లీకులు. మరి కష్టపడి చదివిన వారి సంగతేంటి. ఇదే ఇపుడు తల్లిదండ్రుల ఆవేదనగా ఉంది.
మరో వైపు చూస్తే అసలు లీక్ అన్నదే లేదని చెబుతూ వస్తున్న బొత్స మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ అరెస్ట్ తో ఏం జవాబు చెబుతారు అని ప్రశ్నలు వస్తున్నాయి. తాను ఇప్పటిదాకా ఇచ్చినది తప్పుడు ప్రకటన అని చెబుతారా అని విద్యార్ధి సంఘాల ప్రతినిధులు నిలదీస్తున్నారు. ఇక విద్యా శాఖ మంత్రి బొత్స ఉన్నారు. కానీ విషయం అంతా సీఎం జగన్ టేబిల్ మీద ఉంది. మరి విద్యా శాఖ మంత్రి జగనేనా అన్న చర్చ కూడా వస్తోంది.'
తనకు నచ్చని శాఖను ఇచ్చారని బొత్స ఆ శాఖ మీద పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరిగాయని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ నేత నారాయణ అరెస్ట్ ద్వారా జగన్ సర్కార్ తెలుగుదేశాన్ని బోనులో నిలబెట్టవచ్చు. పరీక్ష పేపర్ల లీక్ బాధ్యులు టీడీపీ వారే అని రాజకీయంగా వారిని కార్నర్ చేయవచ్చు.
కానీ పేపర్లు లీక్ అవకుండా ఆపలేకపోయినందుకు ప్రభుత్వం ఏ రకమైన జవాబు చెబుతుంది అని కూడా అంతా అంటున్నారు. ఏది ఏమైనా నారాయణ అరెస్ట్ తో ఎన్నో ప్రశ్నలు ఇపుడు తెర మీదకు వచ్చాయి. ప్రభుత్వం ఈ అరెస్ట్ ద్వారా రాజకీయంగా పై చేయి సాధించాలని చూసినా టెన్త్ పరీక్షల నిర్వహణలో మాత్రం ఫెయిల్ అయింది అని తానే ఒప్పుకుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ లీకుల కధ మరెన్ని రాజకీయ మలుపులు తిరుగుతుందో.