పోసానికి ఎన్నికల కమిషన్‌ నోటీసులు

Update: 2019-03-21 04:38 GMT
పోసాని కృష్ణమురళి మాంచి ఫైర్‌ బ్రాండ్‌. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు. తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. ఇలా మాట్లాడినందుకు ఒక్కోసారి ఇబ్బందులు కూడా పడతాడు. అలాంటి ఇబ్బందినే ఇప్పుడు పోసాని ఎదుర్కుంటున్నాడు. రెండు రోజుల క్రితం పోసాని మీడియా సమావేశం పెట్టాడు. తాను ఒక సినిమా తీశానని చెప్పాడు. ఈలోగా జర్నలిస్ట్‌లు ఏదో అడిగేసరికి.. చంద్రబాబుపై ఫైర్‌ అయ్యాడు. మొదటినుంచి బాబు అంటే పోసానికి పడదు. దీంతో.. కాస్త ఎక్కువే తిట్టాడు. మధ్యలో ఎక్కడో ఒకచోట టంగ్‌ స్లిప్పై కులం పేరు చెప్పాడు. అసలు పోసాని ఎక్కడ ఎప్పుడు దొరుకుతాడా అని వెతుకుతున్న టీడీపీకి మంచి ఆస్త్రం దొరికింది. వెంటనే ఈసీకి పోసానిపై కంప్లైంట్‌ ఇచ్చింది.
  
ఎన్నికల వేళ కులం పేరు చెప్పి ముఖ్యమంత్రి పరువు తీస్తున్నాడని.. కులం పేరుతో ఓటర్లని ప్రభావితం చేస్తున్నాడని ఈసీకి టీడీపీ నేతలు పిర్యాదు చేశారు. దీంతో.. వివరణ ఇవ్వాల్సిందిగా పోసానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. ప్రస్తుతం తాను నడవలేని స్థితిలో ఉన్నాడని.. యశోద ఆస్పత్రిలో ట్రీట్‌ మెంట్‌ లో ఉన్నానని విచారణకు హాజరు కాలేనని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో నోటీసులపై వివరణ ఇస్తారని పేర్కొన్నారు. మొత్తానికి తమపై విమర్శలతో విరుచుకుపడుతున్న పోసాని నోరు మూయించేందుకు ఈసీని ప్రయోగించింది టీడీపీ.



Tags:    

Similar News