తెలుగుదేశం అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫలితాలకు ముందే తనకు తను పెద్ద పరీక్ష పెట్టుకున్నారు. కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం విషయంలో చంద్రబాబు నాయుడు దాన్ని ప్రిస్టేజ్ ఇష్యూగా మార్చుకున్నారు. కేబినెట్ మీటింగ్ నిర్వహించి తీరతాం అంటూ ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఈ అంశంలో తెగేదాకా లాగుతున్నారు. మరి ఇప్పుడు ఈ అంశం అటు తెగుతుందా - ఇటు తెగుతుందా అనేది ఆసక్తిదాయకంగా మారింది.
ఈ నెల పదో తేదీన కేబినెట్ భేటీ ఉంటుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతే కాదు ఈ విషయంలో అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను కూడా ఆదేశించారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే సీఎస్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గట్టి పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఇప్పుడు కేబినెట్ మీటింగ్ కు ఆయనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం ద్వారా చంద్రబాబు నాయుడు రసవత్తర పోరుకు తెరతీశారు. ఇది వరకూ చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షకు హాజరైనందుకే అధికారులకు నోటీసులు ఇచ్చారు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం. అలాంటిది ఇప్పుడు ఆయనే కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేసి - అధికారులను రమ్మంటారా? అనేది ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది.
అయితే ఈ అంశంలో తప్పించుకోవడానికి సీఎస్ కు ఒక చక్కటి మార్గం ఉంది. అదే బంతిని ఎన్నికల కమిషన్ కోర్టులోకి నెట్టడం. చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయమంటున్నారు - ఆయన ఆదేశాలను పాటించమంటారా.. అంటూ సీఎస్ గనుక ఈ బంతిని ఎన్నికల కమిషన్ కోర్టులోకి వేస్తే ఆయన తప్పుకున్నట్టే.
ఈ మేరకు బాబు ఆదేశాలను సాధారణ పరిపాలన అధికారికి పంపించారట చంద్రబాబు నాయుడు. అటు నుంచి అది ఈసీ వద్దకు వెళ్తుందని సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ అసాధారణ పరిస్థితులు ఏర్పడితేనే కేబినెట్ సమావేశం జరగాలి అనేది నియమం. దాని ప్రకారం అయితే ఇప్పుడు అసాధారణ పరిస్థితులు ఏమీ లేవు. కాబట్టి.. కేబినెట్ భేటీకి ఛాన్సే లేదు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయాన్ని ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ఇలా తనకు తనే పెద్ద పరీక్ష పెట్టుకున్నారాయన. ఈ పరీక్షలో బాబు ఫెయిల్ అవుతారో, పాస్ అవుతారో!