ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేసేందుకు నాయకులే వెనుకాడుతున్న పరిస్థితి ఇప్పుడుంది. ఎందకంటే ఎన్నికలంటే మాటలు కాదు.. డబ్బులు! నామినేషన్ నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అడుగడుగునా డబ్బుల ప్రవాహం పారాల్సిందే. మరి ఇలాంటి పరిస్థితిలోనూ తమిళనాడులోని పద్మరాజన్ అనే నేత ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు
రెడీ అయిపోతున్నాడు. నామినేషన్ దాఖలు చేసేస్తున్నాడు. గెలుపు మాటను పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికి 177వ సారి ఆయన నామినేషన్ దాఖలు చేశాడంటే.. ఆయనలో పట్టు వదలని పోల్ మార్కుడు కనిపించడం లేదా?! వివరాలు చూద్దాం..
తమిళనాడులో సేలం ప్రాంతానికి చెందిన కే పద్మరాజన్(57) కి ఎన్నికల పట్ల మక్కువ ఎక్కువ. ఎప్పటికైనా తాను ఎన్నికల్లో గెలిచి తమిళనాడు అసెంబ్లీలో కూర్చోవాలని, అధ్యక్షా! అంటూ సేలం సంగతులు వివరించాలని ఆయన ఆశ. అయితే, ఏదైనా పార్టీలో చేరొచ్చుకదా? అంటే అలా చేరడు మనోడు! ఎందుకని అడిగితే.. ఆయా పార్టీల్లో విలువలు లేవంటాడు. అందుకే 1988 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ నామినేషన్ దాఖలు చేస్తూనే ఉన్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. అయితే, ప్రస్తుతం ఎన్నికల పోటీలో ఇలాంటి వాళ్లకి ఎవరు ఓటేస్తారు చెప్పండి. అందుకే మనోడికి ఓటమి తప్పడం లేదు.
ఇక, ఇప్పుడు తాజాగా తిరుపరన్ కుంద్రం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో అక్కడ నుంచి ఇండిపెండెంట్ గా పోటీకి దిగాడు. నామినేషన్ పత్రాలు సమర్పించాడు. ఇలా ఈయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం 177వ సారి. దీంతో ఆయన అనుచరులు - మద్దతు దారులు ఒకింత ఆశ్చర్యం - మరోపక్క ఆయనకున్న పట్టుదలకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎస్ ఎం సీనివేల్ గత మే నెలలో గెలిచారు. అయితే - ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టకముందే అదే నెల 25న ఆయన చనిపోయాడు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/